ప్రతి అక్క, చెల్లెమ్మకు మాట ఇస్తున్నా





– ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు
– జూట్‌ మిల్లు భూములు తమవే అన్నట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తోంది
– బాబు పాలనలో రామతీర్థం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
– హుద్‌హుద్‌ వచ్చినప్పుడు 12 వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి
– నెల్లిమర్లలో 23 వేల ఇళ్లు కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌ది
– బాబు సీఎం అయ్యాక ఊరికి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు
– భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం రైతుల నుంచి భూములు  లాక్కుంటున్నారు
–చంద్రబాబు బినామీలకే ఉచిత ఇసుక 
– రైతులను దారుణంగా దోచేస్తున్నారు
–ఎల్లో మీడియా ప్రచారానికి రూ.6.40 కోట్లు ఖర్చు 
– యువతకు ట్రైనింగ్‌ పేరుతో నెలకు రూ.12 వేలు దోచుకునే కార్యక్రమం
– పోలవరం ప్రాజెక్టులో ఎక్కడ చూసినా అవినీతే
– ఆపరేషన్‌ కోసం హైదరాబాద్‌ వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట
– అబద్ధాలు చెప్పేవాళ్లు నాయకుడిగా కావాలా?
–కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా మార్చబోతున్నాం
– వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా ఆర్థికసాయం
– 45 సంవత్సరాలు నిండిన అక్కలకు రూ.75 వేలు 
– ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం 


విజయనగరం: రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా కల్పించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా ఆర్థికసాయం అందిస్తామన్నారు. కార్పొరేషన్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షళన చేసి గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను గుర్తించి కార్పొరేషన్‌ ద్వారా రూ.75 వేలు ఉచితంగా అందించే కార్యక్రమం చేపడుతామన్నారు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు ఎంత రుణం ఉంటే ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి, ఆ ఇంటికి అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లిమర్ల పట్టణంలోని మెయిదా జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే


– ఈ రోజు నెల్లిమర్లలో అడుగుపెడుతూనే దారిపొడవునా చెబుతున్న సమస్యలు..ఇదే గ్రామంలోనే పక్కనే జూట్‌ మిల్లు కనిపించింది. ఆ జుట్‌ మిల్లు పక్కనే వందల కొద్ది చిన్న చిన్న గుడిసెలు, ఇల్లు ఉన్నాయి. వీళ్లంతా కూడా వచ్చి నాతో చెప్పిన మాట..అన్నా..దశాబ్ధాల క్రితం గవర్నమెంట్‌ ఈ జూట్‌ మిల్లుకు లీజ్‌కు భూములు ఇచ్చింది. లీజ్‌ పీరియడ్‌ అయిపోయినా కూడా జూట్‌ మిల్లు ఓనర్‌ మమ్మల్ని బయటకు వెళ్లమని చెబుతున్నారు. ఇంతటి దారుణం కళ్ల ముందే కనిపిస్తున్నా కూడా పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం కూడా మనసు పెట్టకుండా దారుణంగా వ్యవహరిస్తోంది.

–ప క్కనే రామతీర్థ సాగర్‌ ప్రాజెక్టు కనిపిస్తోంది. ఇదే ప్రాజెక్టు ఆ రోజుల్లో నాన్నగారు బతికున్నప్పుడు 49 గ్రామాలకు చెందిన 8 వేల ఎకరాలు స్థిరీకరణ, పట్టణానికి తాగునీటి సమస్య పోతుందని వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ఇదే ప్రాజెక్టుకు చంపవతి నదిపై ప్రాజెక్టు కట్టించారు. రూ.220 కోట్లతో అప్పట్లో పనులు ప్రారంభించారు. యుద్ధప్రాతిపాదికన వైయస్‌ఆర్‌ హయాంలో 30 శాతం పనులు పూర్తి చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఇంతవరకు చిన్న టన్నల్‌కు అనుమతులు తీసుకురావడానికి ఇంత సమయం పట్టిందంటే ఎంతదారుణంగా వ్యవహరిస్తున్నారో ఇదే నిదర్శనం. 
– ఇదే నెల్లిమర్లలో గర్భిణిస్తీ్ర ఆటోలో వెళ్తుందంటే..108 అనే నంబర్‌కు ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ ఏమాత్రం కనిపించడం లేదు. ఆ ఆటోకు స్థలం ఇచ్చి సహకరించాలి. 
–  అన్నా..భోగాపురం ఏయిర్‌పోర్టు ఇదే నియోజకవర్గంలో కట్టాలని ఇక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారు. మంచిదే..తీరా పరిస్థితి గమనిస్తే..అదే భోగాపురం ఎయిర్‌పోర్టుకు చుట్టుపక్కన ఉన్న మంత్రి, ఎంపీ భూములు ముట్టకోలేదు. వాళ్లందరూ కూడా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్నారు. అదే రైతుల భూములు బలవంతంగా లాక్కుంటున్నారని చెబుతున్నారు. వాళ్ల భూములకు రేట్లు పెంచుకోవాలి. రైతుల భూములు లాక్కొని వాళ్లు బాగుపడాలన్న ఆరాటం టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వ ఎయిర్‌పోర్టు అథారిటీ ఇండియా రైతులకు మేలు చేస్తామని టెండర్లు వేస్తే..చంద్రబాబుకు లంచాలు రావని ఆ టెండర్లను రద్దు చేసిన పరిస్థితి చూశాం. రెండోసారి టెండర్లు పిలిచారు. మళ్లీ ఎయిర్‌పోర్టు అథారిటి ఇండియా సంస్థ ఎక్కడ వస్తోందో అని ప్రత్యేక జీవో తెచ్చారు. ఎయిర్‌పోర్టు  ఇండియా 150 సంస్థలను నిర్వహిస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు పక్కన పెట్టారంటే చంద్రబాబు అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు పేరు ఈ అవినీతిలో వినిపిస్తోంది. ఈయన్ను చంద్రబాబు నిలదీయాల్సింది పోయి ఆయనకు తానా అంటే తందాన అంటున్నారు. ఇదే మంత్రి అశోక్‌గజపతిరాజు చంద్రబాబు ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే సమయంలో బాకు మాదిరిగా పని చేశారు. అశోక్‌గజపతిరాజు కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో కూర్చొని రైల్వే జోన్‌ కావాలని అడగడు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడని అడగడు. నిజంగా ఈ జిల్లా ప్రజలు బాధపడుతున్నారు.
– అన్నా..ఆ రోజుల్లో నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో 23వేల ఇల్లులు కట్టించారని చెబుతున్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత ఇవాళ ఊరికి కనీసం మూడు, నాలుగు ఇళ్లు కూడా కట్టించలేదని చెబుతున్నారు. ఇదే జిల్లాలో హుద్‌హుద్‌ తుపాన్‌ వచ్చిన ప్పుడు అక్షరాల 12 వేల ఇళ్లులు ధ్వంసం అయ్యాయని చెప్పారు. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని చెప్పుకొస్తున్నారు.
– చంద్రబాబు పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నా..కానీ ప్రజల ఆస్తులు కొల్లగొడుతున్నారని చెబుతున్నారు. పొక్లైన్లు పెట్టి ఇష్టానుసారంగా ఇసుక, మట్టి తవ్వి అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఇసుక విశాఖపట్నం తీసుకెళ్లి లారీ ఇసుక రూ.30 వేలకు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు మాత్రం ఇసుక ఫ్రీ అంటున్నారు. మీకు ఇసుక ఉచితంగా వస్తోందా? చిన్నబాబు, పెద్ద బాబు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల వరకు లంచాలు ముట్టుతున్నాయి. చంద్రబాబు బినామీలకే ఉచిత ఇసుక అందుతోంది.
– దళితులకు భూములు ఇవ్వాలని ఆరాటపడాలి. అలాంటి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటారు. కానీ ఈ ప్రభుత్వం కొవ్వాడలో రైతుల భూములు లాక్కొని ఒక అనామక కంపెనీకి ఆ భూములు కట్టబెట్టారు. నిజంగా ఆ దళితులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి. 
– ఎన్నికలకు ముందు రుణాల మాఫీ అన్నారు. రైతు రుణాలు బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాపీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు చేసిన రుణమాఫీ పథకం రైతుల వడ్డీలో నాలుగో వంతు కూడా మాఫీ కాలేదు. ఇదే పెద్దమనిషి హయాంలో రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు అందడం లేదు. 
– డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని బాబు ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. సున్నా వడ్డీ రుణాలు అక్కచెల్లెమ్మలకు అందడం లేదు. 
– అప్పట్లో ఈ పెద్ద మనిషి అన్న మాటలు..జాబు రావాలంటే..బాబు రావాలన్నారు.   ఇంటింటికీ మనిషి పంపించి అమ్మా..మీ పిల్లాడు ఏం చదవకపోయినా ఉద్యోగం ఇస్తారు. జాబు రాకపోతే ఇంటింటికీ రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి లక్ష రూపాయలు బాకీ పడ్డారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ పెద్ద మనిషి డ్రామాలాడుతున్నారు. నిరుద్యోగ భృతి అంటు కొత్త పాట పాడుతున్నారు. తీరా చూస్తే రెండు లక్షల 15 వేల మందిని మాత్రమే నిరుద్యోగ భృతికి ఎంపిక చేశారు.రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇల్లు ఉంటే కేవలం రెండు లక్షల మందిని మాత్రమే ఎంపి చేశారంటే, రూ.2 వేలు ఇస్తామని, కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈయన ప్రచారం కోసం రూ.6.40 లక్షలు ఖర్చు చేశారు. నిజంగా పిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటూ స్కామ్‌ చేస్తున్నారు. పిల్లల పేరు చెప్పి, ట్రైనింగ్‌ అంటూ ఒక్కొక్క పిల్లాడి పేరుతో నెలకు రూ.12 వేలు  చొప్పున దోచుకుంటున్నారు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది. అలాంటి ప్రత్యేక హోదాను నీరుగార్చారు. రాష్ట్రం విడిపోయినప్పుడు లక్ష 40 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెబితే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. డీఎస్సీ పరీక్షలు పెట్టలేదు. టెట్‌వన్, టెట్‌ టూ, టెట్‌ త్రీ అంటూ మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పిల్లలు శాంతియుతంగా ఆందోళన చేపడితే లాఠీ చార్జ్‌ చేయించారు. ప్రతి జిల్లాలో హోదా ఉద్యమాన్ని అడ్డుకున్నారు.  ఇదే పెద్ద మనిషి విశాఖలో మీటింగ్‌ పెట్టి ఏకంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అని ఊదరగొడుతున్నారు. ఆ ఉద్యోగాలు ఎక్కడైనా కనిపించాయా? ఉన్న జూట్‌ మిల్లులు మూతపడుతున్నాయి. స్పిన్నింగ్‌ మిల్లులు, సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. ఈ పెద్ద మనిషి హయాంలో ఉద్యోగాలు రావడం దేవుడెరుగు...ఈయన పెంచిన కరెంటు చార్జీలబాదుడు కారణంగా ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. 
– పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. కంటి మీద కునుకు లేదు. ఉన్న ఉద్యోగాలను ఎలా ఊడగొట్టాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్రంలో 40 వేల మంది ఉన్నారు. 53 రోజుల నుంచి స్రై్టక్‌ చేస్తున్నారు. వాళ్లను కూడా తొలగించి కాంట్రాక్ట్‌ వర్కర్లను నియమించి వారి నుంచి లంచాలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. జీవో 279 తెచ్చిన చంద్రబాబు అసలు మనిషేనా అని అడుగుతున్నాను.
– మధ్యాహ్న భోజన పథకం గొప్పగా అమలు చేసి ఆ పిల్లలకు తోడుగా ఉండి, ఆ పథకం అమలు చేస్తున్న అక్క చెల్లెమ్మలకు అండగా ఉండాల్సింది పోయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పథకాన్ని నీరు గార్చుతున్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చెడిపోయిన కోడిగుడ్లు, బియ్యం సరఫరా చేస్తున్నారు. వాటికి నాలుగు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. ఆ అక్కచెల్లెమ్మలు అవస్థలు పడుతుంటే, ఆ వ్యవస్థను కూడా కాంట్రాక్ట్‌కు అప్పగించేందుకు ఆరాటపడుతున్నారు. 80 వేల మంది అక్కచెల్లెమ్మలను నడిరోడ్డుపైకి వచ్చేలా చేస్తున్నారు. ఏ  ఒక్కరికి ఉద్యోగ భద్రత లేదు. కనీస పనికి కనీస వేతనం ఇవ్వడం లేదు.
–108 నంబర్‌కు ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ ఇవాళ రావడం లేదు. ఆ ఉద్యోగులను అభద్రతాభావంతో పని చేస్తున్నారు. 108 వాహనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఆ వాహనాలకు కనీసం ఇన్సురేన్స్‌ చేయించడం లేదు. 
– జెఎన్‌టీయూ కాంట్రాక్ట్‌ అద్యాపకులు, మోడల్‌ స్కూల్‌ ఉపాద్యాయులు, గోపాలమిత్రుల పరిస్థితి, ఏఎన్‌ఎంలు, వీవోఏలు, అంగన్‌వాడీలు అభద్రతాభావంతో బతుకుతున్నారు. ఇది చంద్రబాబు పాలనలో ఉద్యోగుల పరిస్థితి
– పోలవరం ప్రాజెక్టు మనందరికి వరప్రసాదం. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. ఈ ప్రాజెక్టులో ఇవాళ అవినీతి కనిపిస్తోంది. ఇసుక, మట్టి, బొగ్గు కొనుగోలు, కరెంటు కొనుగోలు, రాజధాని బూములు, విశాఖభూముల్లో అవినీతి. చివరకు గుడి భూములను వదలడం లేదు. 
– ఇవాళ రాష్ట్రంలో కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్‌ రేట్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు, స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఏది ముట్టుకున్నా కూడా కనిపించేది బాదుడే బాదుడు. మరోవైపు చంద్రబాబు హయాంలో ఒక్కసారి గమనించండి. ప్రభుత్వ రంగ స్కూళ్లు అన్నీ కూడా రేషనలైజేషన్‌ పేరుతో మూత వేస్తున్నారు. ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. పిల్లలకు మార్చిలో పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉండగా సెప్టెంబర్‌ వచ్చినా ఇవ్వడం లేదు. దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేస్తున్నారు. మనందరి చేత నారాయణ స్కూళ్లు అనిపిస్తున్నారు. ఇవాళ ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులు చదవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. 
– ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా పడకేసింది. ఇవాళ వైద్యం చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు వస్తోంది. మంచి ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. నెట్‌వర్స్క్‌ ఆసుపత్రులకు బకాయిలు ఇవ్వడం లేదు. జిల్లాలో 27 అంబులెన్సులు ఉంటే వాటిలో 17 షెడ్లలో ఉన్నాయి.
– గతంలో రేషన్‌షాపుకు వెళ్తే బియ్యంతో పాటు 9 రకాల సరుకులు ప్యాక్‌ చేసి ఇచ్చేవారు. ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇ వ్వడం లేదు. అందులో కూడా వేలిముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయని జగన్‌ అనే వ్యక్తి దీని గురించిఎక్కువగా మాట్లాడుతున్నారని ముష్టి వేసినట్లు చక్కెర, కందిపప్పు ఇస్తున్నారు.
– గాంధీ జయంతి ..అంటే గ్రామ స్వరాజ్యం. చంద్రబాబు పాలన చూసి ఆశ్చర్యమనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో తాగడానికి మినిరల్‌ వాటర్‌ దొరకడం లేదు. వీధి వీధిలో గుడి పక్కన, బడి పక్కన మందు షాపు కనిపిస్తోంది. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో  ఒక మాఫియాను నడిపిస్తున్నారు. ఏ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే.
– నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఈ పాలనలో అబద్ధాలు, మోసాలు, అవినీతి, అధర్మం కనిపించింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒ క్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతున్నాను. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఏదైనా నాయకుడు ఫలానిది చేస్తానని ప్రజలతో ఓట్లు వేయించుకున్న తరువాత ఆ నాయకుడు అది చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు రావాలంటే ఒక్క వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత వస్తుంది.
–రేపు పొద్దున  ఇలాంటి అన్యాయమైన పాలన పోయి..దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక అక్కచెల్లెమ్మలకు ఏం చేస్తామన్నది చెబుతున్నాను. కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా మార్చబోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు మార్చివేస్తాం. 45 ఏళ్లు నిండిన అక్కలను గుర్తించి..ప్రతి అక్కకు రూ.75 వేలు నాలుగు ధపాలుగా డబ్బులు ఇస్తూ చేయిపట్టి నడిపిస్తూ వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా తోడుగా ఉంటాం. ఉచితంగా రూ.75 వేలు ఆ అక్కకు వస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సెక్రటరేట్‌ తీసుకువస్తాం. ఎవరికైనా సంక్షేమ పథకాలు కావాలంటే దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో మంజూరు చేసే కార్యక్రమం చేపడుతాం. కులాలు, మతాలు, రాజకీయాలు చూడకుండా అర్హుడైన ప్రతి ఒక్కరిని గుర్తించి గ్రామ సచివాలయం ద్వారా వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా గుర్తించి ఆదుకుంటాం. 
– అక్క చెల్లెమ్మలకు చేసే రెండో కార్యక్రమం పక్కా ఇల్లు కట్టించడం. ఆ రోజుల్లో వైయస్‌ఆర్‌ దేశంతో పోటి పడి ఉమ్మడి రాష్ట్రంలో 48 ల„ý ల ఇళ్లులు కట్టించారు. ఆ పాలన మళ్లీ తెస్తాం. అక్కచెల్లమ్మలకు ఇళ్లు కట్టించి, ఆ ఇంటిని వారి పేరు మీదుగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. రేపు పొద్దున ఏమైనా అవసరమైతే ఆ ఇంటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతాం. పొదుపు రుణాలు మాఫీ చేస్తాం. 
 – ప్రతి అక్కకు హామీ ఇస్తున్నాను..2019 ఎన్నికలు జరుగబోతున్నాయి. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మాట ఇస్తున్నానని చెబుతున్నాను. ఇందులో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా రావచ్చు. అర్జీలు ఇవ్వవచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.






 

తాజా వీడియోలు

Back to Top