- రాష్ట్రంలో అప్పు నిప్పు అవుతోంది- అమరావతి బాండ్లతో డ్రామాలు- రాష్ట్రంలో అన్ని టెంపరరీ నిర్మాణాలే- రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే- రాజధాని నిర్మానానికి టెంకాయ కొట్టేందుకు రూ.100 కోట్లు
విశాఖ: రాష్ట్రంలో అబద్ధాలు, అవినీతి, మోసాలు, అన్యాయం పాలన జరుగుతుందని, దీనికి తోడు చంద్రబాబు దుబారాతో రాష్ట్రం అప్పు..నిప్పుగా మారుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లలో చంద్రబాబు దుబారా అక్షరాల రూ.6 వేల కోట్లు అయ్యిందని, ఈ నిధులు పోలవరానికి ఖర్చు చేసి ఉంటే ఈ పాటికి నీరు వచ్చేదని ఆయన ధ్వజమెత్తారు. రూ.6 వేల కోట్లు దుబారా చేసి, బాండ్ల పేరుతో రూ.2 వేల కోట్లు అప్పు తీసుకురావడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కోట వురట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.- దగ్గరుండి చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌తో చంద్రబాబు జట్టు కట్టేందుకు తహతహలాడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో కొనసాగిన వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.- బ్రిటిష్ పాలన మాదిరిగా చంద్రబాబు రాష్ట్రంలో విభజించు పాలించు సూత్రాన్ని పాటించి దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు నుంచి ప్రకాశం దాకా మైనింగ్ మాఫియా చేస్తున్నారని, మైనింగ్ డాన్ చంద్రబాబే అన్నారు. తన కుమారుడు లోకేష్ ప్యాకెట్ మనీ కోసం రాష్ట్రంలో నాలుగేళ్లుగా అన్ని రకాల చార్జీల బాదుడే బాదుడన్నారు.- కేంద్రం కట్టాల్సిన రాజధానిని చంద్రబాబు తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు రాజధానిలో పర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక కూడా కట్టలేదని విమర్శించారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తానని మాయమాటలు చెప్పి రైతుల వద్ద భూములు బలవంతంగా లాక్కొని..తన బినామీలకు లంచాలు తీసుకొని అప్పన్నంగా కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. - చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి..వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు. - అమరావతిలో అడుగు రూ.10 వేల చొప్పున నిర్మించిన టెంపరరీ సచివాలయంలో బయట 3 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే..లోపల 6 సెంటీమీటర్ల నీరు కనిపిస్తుందన్నారు. ఇవాళ ఏకంగా పైకప్పు ఊడిపోయిందని తెలిసిందన్నారు.
చంద్రబాబు దుబారా ఖర్చులు ఇలా..- ధర్మ పోరాట దీక్షలకు జిల్లాకు రూ. 4 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.52 కోట్లు- ప్రత్యేక విమానాల ఖర్చు- రూ.100 కోట్లు- హైదరాబాద్‌లో ఎల్ బ్లాక్ మరమ్మతులకు -రూ.14.30 కోట్లు- హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయ మరమ్మతులకు- రూ6.90 కోట్లు- లేక్యూ గెస్ట్‌హౌస్ కోసం- 9.50 కోట్లు- పర్నిచర్ కోసం- 10 కోట్లు- ఫాం హౌస్ కోసం- 4.50 కోట్లు- అమరావతిలో ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ కోసం- రూ.42 కోట్లు- ప్రత్యేక బస్సు కోసం- 5.50 కోట్లు- రాజధాని శంకుస్థాపన కోసం ప్రధానిని పిలిపించిన సందర్భంలో -రూ.250 కోట్లు- రాజధానికి మూడుసార్లు టెంకాయ కొట్టేందుకు రూ.100 కోట్లు- హైదరాబాద్-విజయవాడ ప్రయాణ ఖర్చులు- రూ.150 కోట్లు- రాజధాని నిర్మాణంలో కన్సెటెన్సీల కోసం- రూ.300 కోట్లు- తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి రూ.1100 కోట్లు- హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం ఉండేందుకు హైయ్యత్ హోటల్ బాడుగ-రూ.30 కోట్లు- కృష్ణా, గోదావరి పుష్కరాలకు రూ.3200 కోట్లు- హ్యాపీ సండేస్ పేరుతో ఖర్చు- రూ.10 కోట్లు- హ్యాపీ సిటీస్ ఖర్చు- రూ.61 కోట్లు- జన్మభూమి నిర్వాహణ ఖర్చు- రూ.125 కోట్లు- నవ నిర్మాణ దీక్షల ఖర్చు- 80 కోట్లు- విదేశీ విమానాల ఖర్చు- 120 కోట్లు- పోలవరానికి వెళ్లేందుకు బస్సు ఖర్చులు-రూ.23 కోట్లు- భాగస్వామ్య సదస్సుల ఖర్చు-రూ. 150 కోట్లు- మొత్తం కలిపితే చంద్రబాబు దుబారా రూ.6 వేల కోట్లు