కొత్త పెళ్లి కూతురు కోసం బాబు కాంగ్రెస్‌ వైపు చూపు


– స్వాతంత్య్రం కోసం బాబు పోరాటం చేశారట..
– అప్పుడు చంద్రబాబు లాగు అన్న వేసుకున్నాడా?
– అమరావతికి చంద్రబాబు ఒలింపిక్స్‌ తీసుకువస్తారట
– బీజేపీతో కలిసినప్పుడు బాబుకు కొల్లేరు, హోదా గుర్తుకు రాలేదు
– ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని బాబు బీజేపీతో విడాకులు తీసుకున్నారు
– ప్రజాస్వామ్యం గురించి బాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది
– 23 మంది ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారే 
– వెన్నుపోటు పొడవటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
– సీడ్‌లో నాణ్యత లేదు..టెస్టులకు ల్యాబ్‌లు లేవు
– చేపలు, రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం
– వైయస్‌ఆర్‌ హయాంలో చెరువులకు 90 పైసలకే యూనిట్‌ కరెంటు 
– ఐస్‌ ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ.5లకే విద్యుత్‌
– ప్రతి గ్రామంలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేస్తాం
– పేదలకు ఇల్లు కట్టిస్తాం
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక చదువుల విప్లవం తెస్తాం
– ఎన్ని లక్షలు ఖర్చైనా భరిస్తాం
– హాస్టల్‌ ఖర్చులకు ప్రతి ఏటా రూ.20 వేలు
– చిన్న పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తాం

పశ్చిమ గోదావరి: నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని మరో కొత్త పెళ్లి కూతురు కాంగ్రెస్‌తో జత కట్టేందుకు చూస్తున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలోని గణపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

ఎండలు తీక్షణంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఖతరు చేయకుండా, ఒకవైపు బాధలు ఉన్నా..కష్టాలు చెప్పుకుంటూ, అర్జీలు ఇస్తూ,,మరోవైపు నా భుజాన్ని తడుతూ..అన్నా నీకు తోడుగా ఉన్నామంటూ నాతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. వేలాది మంది నాతో పాటు నడుచుకుంటూ రావాల్సిన అవసరం లేదు. ఈ దుమ్ములో, దూళిలో నిలవాల్సిన అవసరం అంతకన్న లేదు. అయినా ఇవేవి కూడా ఖతరు చేయకుండా చిక్కని చిరునవ్వుతో ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.
– ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే ఆక్వా రైతులు కలిశారు. చేపలు, రొయ్యల రేట్లు పడిపోతున్నా కూడా కనీసం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని రైతులు మాట్లాడుతుంటే నిజంగా బాధనిపించింది. జిల్లాలో 2 లక్షల మంది చేపల చెరువులపై ఆధారపడి జీవిస్తున్నారు. కేజీ రొయ్యలు మాములుగా రూ.400 ఉండాలి. ఇవాళ పంట చేతికొచ్చేసరికి రూ.230 ఉంది. కేజీ చేపల ధర రూ.110 ఉండాల్సి ఉంది. ఇవాళ రూ.80లకు కూడా అడగడం లేదు. అన్నా ..ఎంత దారుణంగా ఉందో మా బతుకులు అంటున్నారు. దాణా వేసే వరకు కూడా దళారులే. దళారీ వ్యవస్థలు కనిపిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
– అన్నా..ఏలూరు కాల్వ నుంచి నీరు రావాలన్నా..గడిచిన రెండేళ్లుగా నీళ్లు రావడం లేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితిని చూసి బాధనిపించింది. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంది. బోర్లు వేస్తే ఉప్పునీళ్లు..పై నుంచి నీరు రావడం లేదు. ఎలా బతకాలని ప్రజలు వాపోతున్నారు. చేపల చెరువుకు నీరందక ఒక చెరువు నుంచి మరో చెరువుకు తోడుకుంటున్నామని రైతులు అంటున్నారు. వేరే చెరువు నుంచి నీళ్లు తోడుకుంటే చేపలకు వైరస్‌ వస్తుంది. చేపలకు, రొయ్యలకు సీడ్‌ ఉత్పత్తి చేసే హాచరీస్‌లో ఏమాత్రం నాణ్యత లేదు. ఆ సీడ్‌ కొనుగోలు చేసిన రైతు అందులో ఏదైనా వైరస్‌ ఉందని తెలుసుకునేందుకు ల్యాబ్‌లు కూడా అందుబాటులో లేవు. ప్రైవేట్‌ ల్యాబ్స్‌తో వ్యాపారులు కుమ్మక్కై మమ్మల్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి దాకా సీడ్‌ రేటు 30 పైసలు నుంచి 70 పైసలు ఉండేవి. హాచరీస్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ముడి సరుకుల రేట్లు విఫరీతంగా పెరిగినా అడిగే పరిస్థితి లేదు.
– నాన్నగారి హాయంలో 90 పైసలకే యూనిట్‌ కరెంటు ఇచ్చేవారు. ఇవాళ రూ.3.80 పైసలు గుంజుతున్నారు. దీనికి తోడు అడిషనల్‌ ఫెనాల్టీల పేరుతో వేలల్లో జరిమానా విధిస్తున్నారు. ఇంతకన్న దారుణం మరేమైనా ఉంటుందా? 
– రేపు పొద్దు ఆ దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్న రైతులకు కరెంటు రూ.1.50కే యూనిట్‌ సరఫరా చేస్తాం. ఒరిస్సా రాష్ట్రంలో రూ.1.50కే కరెంటు ఇస్తే..ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు.
– కరెంటు రేట్లు షాక్‌ కొడుతున్నాయి. పరిశ్రమలకు యూనిట్‌కు రూ.13 వసూలు చేస్తున్నారు. ఆ రేటును రూ.7 తగ్గించి రూ.5 లకే యూనిట్‌ కరెంటు ఇస్తాం. ఉత్పత్తి చేసే రొయ్యలకు అనుగుణంగా ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. సముద్ర తీరం వెంట ఈ యూనిట్లు ఏర్పాటు చేసి నాలుగో ఏటా మద్దతు ధర ప్రకటిస్తాను. విత్తనం కొనుగోలు చేసేందుకు నియంత్రణతీసుకొస్తాను. దళారీ వ్యవస్థను నిర్మూలన చేసి రైతులకు తోడుగా ఉంటా. 
– నాలుగేళ్లుగా పరిస్థితులు గమనించమని కోరుతున్నాను. వరి రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కనీస మద్దతు ధర రూ.1400 అంటున్నారు. మార్కెట్‌కు వెళ్తే రూ.1100లకు కొనుగోలు చేసే నాథుడు లేదు.
– కొల్లేరుకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తాను. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమీ గుర్తుండటం లేదు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యా. నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబుకు కొల్లేరు గుర్తుకు రాదు. ఎన్నికల సమయంలో వేరే వారిపై నెపం నెట్టేందుకు బీజేపీతో విడాకులు తీసుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా, కొల్లేరు గుర్తుకు వస్తున్నాయి. విడాకులు తీసుకున్నాక కొత్త పెళ్లి కూతురు కాంగ్రెస్‌తో కలిసేందుకు మళ్లీ ఇవాళ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. కొల్లేరు సమస్య సుప్రింకోర్టు పరిధిలో ఉంది. ఈ సమస్యపై చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ ప్రాంతంపై బాగా అవగాహన ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీగా చేసి నా పక్కనే కూర్చొబెట్టుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. కొల్లేరుపై రీ సర్వే చేయిస్తాం. తప్పులు సరిదిద్ది వీలైనన్ని ఎక్కువ ఎకరాలు బయటకు తెచ్చి పేదలకు పంపిణీ చేయిస్తాను.
– దారిపొడవునా ఇక్కడికి వచ్చేటప్పుడు తాగడానికి నీరు లేదు. ఇవాళ ప్రతి గ్రామానికి చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకులు ప్రతి గ్రామంలో కట్టి..గోదావరి నీళ్లతో పూర్తిగా నింపుతా. కృష్ణా జలాలుతీసుకొస్తానని హామీ ఇస్తున్నాను.
– రెండో ప్రధానమైన సమస్య ఏంటంటే..అన్నా నాలుగేళ్ల కిందట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం అన్నాడు. ఇల్లు కట్టిస్తామని ఊదరగొట్టారు. నాలుగేళ్లు అయ్యింది ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఇవాళ మీ అందరికి హామీ ఇస్తున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టిస్తానని మాట ఇస్తున్నాను. ఆస్తి రూపంలో ఇల్లు వస్తే ఆ అక్క చెల్లెమ్మలకు డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంకులో ఆ ఇల్లు పెట్టి పావలా వడ్డీకే రుణం పొందే వీలు కల్పిస్తాను. 
– రాష్ట్రంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు చేస్తున్న మోసాలు మీ అందరికి తెలుసు. ఆ మోసాలు నిన్న విశాఖపట్నంలో క్లైమాక్స్‌కు చేరాయి. ముఖ్యమంత్రి స్థాయిలో నిసిగ్గుగా అబద్ధాలు చెప్పారు. నిన్న విశాఖలో ఆయన చేసింది ధర్మ పోరాటమట. తిరుపతిలో ప్రధాన అర్చకులు చంద్రబాబు అవినీతిని ఎత్తి చూపిస్తే అధర్మమంటారు. నిజంగా చంద్రబాబు అన్యాయస్తుడు. అబద్ధాలు చెప్పడం, మోసాలు చెప్పడం చంద్రబాబుకు బాగా అలవాటు అయ్యింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పైన చంద్రబాబు కూర్చొని మట్టి, ఇ సుక, మద్యం, బొగ్గు, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, చివరికి గుడి భూములను కూడా వదలిపెట్టడం లేదు. కింద గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు అంటూ మాఫియాను తయారు చేశారు. పింఛన్లు , రేషన్‌కార్డులు కావాలన్నా లంచాలు ఇవ్వాలి. ఈ పెద్ద మనిషి ధర్మ పోరాటం పేరుతో మాట్లాడుతూ..కర్నాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బాధనిపిందట..ప్రజాస్వామ్యం గెలిచిందని అంటారు. 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. వారిలో నలుగురిని మంత్రులను చేశారు. వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడి..ఇప్పుడు కర్నాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందని అంటారు. నిన్న ఆయన మాట్లాడుతూ..రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేశారట. రూ.87 వేల కొట్ల రుణాలు మాఫీ చేస్తానని, ఆయన చేసిన మాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు. మూడు రోజుల క్రితం చంద్రబాబు ట్వీట్‌ చేస్తూ ..రూ.13 వేల కోట్లు అన్నారు. నిన్న సభలో రూ.24 వేల కోట్లు అంటారు. ఈయన పరిపాలనకు యోగ్యుడా? ఆయన అబద్దాలు కప్పిపుచ్చుకునేందుకు చనిపోయిన వైయస్‌ఆర్‌ టాఫిక్‌ తీసుకొచ్చారు. మహానేత కేవలం 50 శాతం మాత్రమే నెరవేర్చారట. ఈయన మాత్రం అన్నీ నెరవేర్చారట. నోరు తెరిస్తే అబద్ధాలు..మోసాలు. నాలుగేళ్లలో ఈ పెద్ద మనిషి 2 లక్షల ఇల్లులు కట్టలేదు. ఏడాదిలో 19 లక్షలు ఇల్లు కడతారట. వైయస్‌ రాజశేఖరరెడ్డి గురించి అబద్ధాలు చెప్పారు. 13 జిల్లాల ఏపీలో 26 లక్షల ఇల్లు కట్టారు. 23 జిల్లాల్లో 48 లక్షల ఇల్లు కట్టి దేశంతో పోటిపడ్డ ఏకైక నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి. 
– మొన్న తిరుపతిలో చంద్రబాబు స్వాతంత్య్ర పోరాటంలో టీడీపీ పాల్గొందని చెప్పారు. అప్పుడు చంద్రబాబు కనీసం నిక్కరైనా వేసుకున్నారా? ఆయన అప్పుడు ఉండి ఉంటే స్వాతంత్య్రం ఎందుకనేవారు. ఈయన గారు అబద్ధాలు దోమలపై దండయాత్ర చేశారట. అమరావతికి ఒలంపిక్స్‌ తీసుకొస్తారట. అమరావతిలో ఇంతవరకు ఒక్క ఇటుక వేయలేదు. మన చెవిలో పువ్వులు పెడుతుంటే ఈయనను ఏమనాలి. కంప్యూటర్లు, సెల్‌పోన్లు కనిపెట్టానంటారు. ఈయన ప్రైవేట్‌ జెట్లపై విదేశాలకు వెళ్తారు. ఆయనకు అనుకూలమైన మీడియా అక్కడిండి  ఏదేశం వెళ్తే అ దేశంలోనివి ఇక్కడికి తెచ్చారట. సత్యనాదేళ్ల ఈయన స్ఫూర్తితోనే అంటారు. సింధూకు షెటిల్‌ నేర్పించానంటారు. నిన్న కలెక్టర్లకు 10 డిగ్రీలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్లుగా జరుగుతున్న పాలన చూడండి. 
– రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నిన్న విశాఖలో మాట్లాడుతూ..నాలుగేళ్లలో 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయట. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయట. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకుంటే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. నాలుVó ళ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అక్క చెల్లెమ్మలు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టమంటారు. చంద్రబాబు పాలనలో కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మలు ఉన్నారా? పొదుపు రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారు. ఇంతటి అన్యాయమైన, అబద్ధాలు ఆడే వ్యక్తిని పొరపాటునా క్షమిస్తారా? మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మోసం చేసేవాడు మీకు నాయకుడు కావాలా? ఏదైనా రజకీయ నాయకుడు ఫలానిది చేస్తానని చెప్పి చేయకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. 
– చంద్రబాబును పొరపాటున క్షమిస్తే రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదట మైక్‌ పట్టుకొని అన్ని చేశానని చెబుతారు. ఆయన మీడియా చంద్రబాబు అన్ని చేశారని రాస్తారు. రేపు పొద్దున ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చెబుతారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి..కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. ప్రతి ఇంటికి తన మనిషిని పంపించి రూ.3 వేల డబ్బు పెడతారు. డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. ఓటు వేసే సమయంలో మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి.అబద్ధాలు చెప్పే వారిని, మోసం చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ వస్తుంది.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి మీటింగ్‌లో కొన్ని అంశాలు చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం వచ్చాక పేదవాడి చదువుల కోసం ఏం చేస్తామంటే..
– ఇవాళ ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. చంద్రబాబు అనే వ్యక్తి ఎన్నికల సమయంలో పేదవాడిపై ప్రేమ అంటారు. బీసీలకు నాలుగు కత్తెర్లు ఇస్తే ప్రేమ అవుతుందా? బీసీలపై నిజంగా ప్రేమ చూపించింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గర్వంగా చెబుతాను. నిజంగా పేదరికం నుంచి బయటకు రావాలంటే ప్రతి కుటుంబం నుంచి డాక్టర్, ఇంజినీర్‌ కావాలి. ప్రతి పేదవాడికి వైయస్‌ఆర్‌ భరోసాగా ఉండేవారు. నేను చదివిస్తా..నువ్వు చదువు అని తోడుగా ఉండేవారు. ఇవాళ పేదవాడి పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా చదివించే పరిస్థితి ఉందా? ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తున్నారు. మిగిలిన డబ్బుల కోసం ఆ పేదవాడు ఇల్లు, పొలం అమ్ముకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మారుస్తానను. పేదవాడి కోసం వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్క అడుగు ముందుకు వేస్తే..ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ బిడ్డలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేనే భరిస్తా. అంతేకాదు మీ బిడ్డలు హాస్టల్‌లో ఉండి చదువుకునేందుకు ప్రతి ఏటా రూ. 20 వేలు ఇస్తాను. అలాగే చిట్టి బిడ్డలను బడికి పంపిస్తే ఆ తల్లి ఖాతాలో రూ.15 వేలు ప్రతి ఏటా జమా చేస్తానని మాట ఇస్తున్నాను. పిల్లలను బాగా చదివిస్తేనే మన తల రాతలు మారుతాయి. నవరత్నాల్లో ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలంటే నాకు అర్జీలు ఇవ్వవచ్చు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top