అనంతపురం) ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పులు, మోసాలు చేస్తున్నప్పటికీ ఎవరూ ప్రశ్నించకూడదా అని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సూటిగా నిలదీశారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా యాడికి లో ఆయన ప్రజలతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి బాగోతం గురించి ఆయన సవివరంగా మాట్లాడారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు. ఇసుక నుంచి బొగ్గు దాకా అన్నింటా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 17 మంది ఎమ్మెల్యేలను దాదాపు 6వందల కోట్ల రూపాయిల దాకా వెచ్చించి కొన్నారని లెక్క వేశారు. ఇంతటి సొమ్ములు చంద్రబాబుకి ఎలా వచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో హామీలు ఇచ్చి మాట తప్పారని వైయస్ జగన్ మండిపడ్డారు. అబద్దాలు, మోసాలు చేస్తుంటే చంద్రబాబుని నిలదీయటంలో తప్పే ముందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇటువంటి మోసాలు చేస్తున్న చంద్రబాబుని చెప్పుతో కొట్టడం తప్పా అని వైయస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.