డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లుశ్రీ‌కాకుళం: బాలాసోర్‌లోని అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి అగ్ని5 క్షిపణి పరీక్షను డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది. వరుసగా ఏడోసారి అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మేర‌కు డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌ల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అగ్ని-5 క్షిప‌ణి  5వేల కిలో మీటర్ల లక్ష్యాన్నిఛేదించగలదు. 1.5 టన్నుల అణు పేలుడు పదార్థాలను ఈ క్షిపణి మోసుకెళ్లగలదని డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌ల‌కు పేర్కొంటున్నారు.  

 

తాజా వీడియోలు

Back to Top