కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళ జననేతకు తమ బాధలు చెప్పుకున్నారు. తన భర్తపై హత్యయత్నానికి పాల్పడిన వ్యక్తులు బయట తిరుగుతున్నారని, తమకు రక్షణ కరువైందని వాపోయారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.