<br/>హైదరాబాద్: విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డిని శుక్రవారం సినీ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. వైయస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వర గా జననేత కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇవాళ వైయస్ జగన్‌ను సిటీ న్యూరో వైద్యులు పరీక్షించి మరో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఈ నెల 3వ తేదీ నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాదయాత్ర వాయిదా పడింది.