తొలిరోజు పాదయాత్ర@8.9కి.మీ.

వైయస్ఆర్ జిల్లాః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తొలిరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. మొదటి రోజు 8.9 కి.మీ వైయస్ జగన్ పాదయాత్ర సాగింది. ఇడుపుల పాయ నుంచి మారుతీనగర్, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లి మీదుగా వేంపల్లి రోడ్డువరకు వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగింది. దారిపొడవునా వైయస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మారుతినగర్ లో హారతులతో మహిళలు స్వాగతం పలికారు. వీరన్నగట్టుపల్లె సర్కిల్ లో వైయస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వేలాది మంది ప్రజలు జననేతతో కలిశారు. వైయస్ జగన్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నడిచారు. ఇతర జిల్లాల నుంచి పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు

Back to Top