<br/><br/><br/>విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం వైయస్ జగన్ పాదయాత్ర సాలూరు నియోజకవర్గం నుంచి పార్వతీపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సీతానగరం మండలం బొగ్గన్నదొరవలస వద్ద వైయస్ జగన్‌కు స్థానికులు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. 296వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం 7.30 గంటలకు మక్కువ మండలం కొయ్యానపేట నుంచి ప్రారంభమైంది. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం తామరఖండి వరకు పాదయాత్ర సాగుతుంది. భగవంతుని దీవెనలు, ప్రజల ఆశీస్సులతో పాదయాత్రను చేస్తోన్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పడుతున్నారన్నారు. ఏ గ్రామానికి వెల్లినా అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పింఛన్లు, ఇళ్లు, భూ సమస్యలను జననేత దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. జగన్ సీఎం అయితే వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ అందుతుందని భావిస్తున్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం తరువాత రెండో రోజు పాదయాత్రలో ప్రజలు, మహిళలు యువత రెట్టింపు ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు అవరోధాలను తప్పించుకుని ముందుకు వచ్చారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్తున్నారు.