ఏపీ సీఎంకు అక్కడేం పని?

హైదరాబాద్:  ఓటుకు నోటు కేసులో తాము చేసిన ఫిర్యాదుపై గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ముడుపుల కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడును A-1 నిందితుడిగా చేర్చాలని తాము గవర్నర్ను కోరినట్లు ఆయన చెప్పారు.

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో కలిసి వైఎస్ జగన్ మంగళవారం గవర్నర్ నరసింహన్ను కలిసి రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్యేకు ఐదు కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డ చంద్రబాబు... మిగతా 17 మంది ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ముట్టచెప్పారో తేలాలని డిమాండ్‌ చేశారు.

పక్క రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎంకు పనేమిటని వైఎస్ జగన్‌ ప్రశ్నించారు. తెలంగాణలో గెలిచినా... గెలవకపోయినా ఏపీ సర్కార్ ఏమీ పడపోదన్నారు. బలం లేదని తెలిసి కూడా పోటీ పెట్టి డబ్బులతో ఎమ్మెల్యేలను కొని రాజకీయం చేయాలనుకోవటం దారుణమన్నారు. ఇక ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇస్తామంటుంటే.. అసలు ఆ డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని అడిగారు.  ఒక్క ఎమ్మెల్సీ గెలవకపోతే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు.
Back to Top