శ్రమ జీవులందరికీ వైయస్ జగన్ మేడే శుభాకాంక్షలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రమజీవులందరికీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మిక సోదరులకు, తెలుగు రాష్ట్రాలనుంచి ఇతర రాష్ట్రాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్ళిన శ్రామిక సోదరులకు ఆయన మే డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 

పారిశ్రామిక రథం కదులుతోందన్నా, ఆర్థిక వ్యవస్థలో ఏ ఉత్పత్తి కార్యకలాపం, జరుగుతోందన్నా అది కార్మికులు శ్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలనే ధారపోయటం, వల్ల సాధ్యమవుతోందని జగన్‌ అన్నారు.

కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడంలో, శ్రామికుల సంక్షేమం కోసం పథకాలు రచించటంలో మహానేత వైయస్సార్‌  పాలన, ఆయన  పంథా దేశంలోనే సువర్ణ అధ్యాయమని, అదే బాటలో వైయస్ ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి అడుగులు వేస్తోందని జగన్‌ అన్నారు. కార్మికుల పక్షపాతిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ వారి హక్కుల పరిరక్షణకు, వారు–వారి కుటుంబాలు మరింత
సంతోషంగా ఉండేందుకు అన్ని విధాలా పాటుపడుతుందని జగన్‌ అన్నారు.  

తాజా వీడియోలు

Back to Top