దాస‌రికి వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

హైదరాబాద్‌: ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయ‌న్ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం ప‌రామ‌ర్శించారు. రెండు రోజుల క్రితం అన్నవాహికలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఆయనను వైద్యులు పరీక్షించి ఊపిరితిత్తులు, కిడ్నీలు కూడా ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు గుర్తించి వైద్యసేవలు అందజేస్తున్నారు. దాసరి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలియడంతో వైయ‌స్ జ‌గ‌న్‌ ఆస్పత్రికి చేరుకొని ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.

Back to Top