నారాయణరెడ్డి మృతికి సంతాపం

హైదరాబాద్‌ : అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి మృతికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపం తెలిపారు. నారాయణరెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన సోదరుడు బి.గురునాథ్‌రెడ్డితో  ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. నారాయణరెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించేందుకు  వైయస్ జగన్‌ అనంతపురం బయలుదేరారు. 

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణరెడ్డి... హైదరాబాద్‌లోని సోదరుడి నివాసంలో ఉంటూ అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లి వైయస్ జగన్ నారాయణరెడ్డిని పరామర్శించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top