భరత్ దంపతులకు ఆశీస్సులు

గుంటూరు)
పార్టీ నాయకుల ఇంట జరిగే కార్యక్రమాలకు హాజరై, వారిని అబినందించటం పార్టీ
అధ్యక్షులు వైఎస్ జగన్ కు అలవాటు. ఈ క్రమంలోనే పార్టీ ప్రకాశం జిల్లానాయకుడు
గొట్టిపాటి భరత్ వివాహ వేడుకలకు ఆయన స్వయంగా హాజరై కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు.

సాయంత్రం
హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన వైఎస్ జగన్..
విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడి
నుంచి రోడ్డు మార్గంలో చిలకలూరిపేటకు వెళ్లారు.వైఎస్ జగన్‑కు పార్టీ నాయకులు, కార్యకర్తలు
స్వాగతం పలికారు.

చిలకలూరిపేటలో జరిగిన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం
వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఈలోగా
అదే కార్యక్రమానికి టీడీపీ నేత, మాజీమంత్రి నందమూరి
హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, హరికృష్ణ
కలిశారు.

తాజా వీడియోలు

Back to Top