వైయస్‌ జగన్‌ నిండు నూరేళ్లు వర్ధిల్లాలి

 

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. వైయస్‌ జగన్‌ 45వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చెల్లా మధు, కొలగట్ల వీరభద్రస్వామి తదితరులు కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మా పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 45వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏ ఆశయంతోనైతే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని నెలకొల్పారో, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు, ఆ రాజన్న రాజ్యాన్ని తీసుకురావడానికి వైయస్‌ జగన్‌ చేస్తున్న కృషి ఫలించాలని, మీ అందరూ ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు. అధికార పార్టీ ఎన్నో ఆటంకాలు పెడుతున్నా, ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా సడలని సంకల్పంతో వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తున్నారని చెప్పారు.  వైయస్‌ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు ఎలాంటి నిబ్బరాన్ని ఇచ్చారో..అలాంటి నిబ్బరాన్ని వైయస్‌ జగన్‌ ఇస్తారని విశ్వసించారు.  ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైయస్‌ జగన్‌కు దీవెనలు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరారు.  
Back to Top