ప్రధానికి వైఎస్ జగన్ లెటర్..!

ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈనెల 22న అమరావతి రాజధాని శంకుస్థాపనకు వస్తున్న సంద్భంగా అపాయిట్ మెంట్ ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ లేఖ ద్వారా ప్రధానిని కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసివస్తామని, కలిసే అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.


ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం చేయాల్సిన పోరాటమంతా చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాం. రాష్ట్రంలో ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశానని వైఎస్ జగన్ లేఖలో తెలిపారు. ఐతే, ప్రభుత్వం దీక్షను భగ్నం చేసిందని వివరించారు. 

పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా హామీ ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంతో ఆవశ్యమన్నారు. ప్రజాభిష్టం మేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ పార్టీనేతలతో వచ్చి వినతిపత్రం సమర్పిస్తామని, తిరుపతి లేదా గన్నవరం విమానాశ్రయంలో ఎక్కడైనా కలిసే అవకాశం ఇవ్వాలన్నారు. 
Back to Top