వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే ప్రత్యేక హోదా

 

అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రత్యేక హోదా వస్తుందని ధర్మవరం యువకులు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని యువత కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలు అన్నట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీకి గుణపాఠం చెబుతామన్నారు. జిల్లాలో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నామని యువకులు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం యువత పోరాడుతుంటే కేసులు పెట్టి భయపెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌కు మద్దతుగా ఉంటామని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని యువత అభిప్రాయపడ్డారు. 
 
Back to Top