·  బంద్ ను విజయవంతం చేయండి
· ప్రత్యేక హోదా పై చిత్తశుద్ధి ఉంటే బంద్ కు అంతరాయం కలింగించరు

· లోకసభలో రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడిందెవరు

· వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి

హైదరాబాద్: చంద్రబాబు ఢిల్లీకి అవిశ్వాసానికి మద్దతు పలికిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లారా..? లేక సంధి కుదుర్చుకోవడానికి వెళ్లారా..? అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కపటానికి, వంచనకు నాలుగేళ్లుగా బలైపోయిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేస్తున్న తిరుగుబాటులో భాగమే 24న జరగబోయే బంద్ అన్నారు. ఉద్యోగాల కల్పన, అభివృద్ధి, ప్రజల సంక్షేమంలో చంద్రబాబు అడుగు కూడా వేయకుండా ప్రజలను వంచించిన చంద్రబాబు.. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంతో ద్రోహం బయటపడిందన్నారు. దగా, మోసానికి చంద్రబాబు పర్యాయపదం కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు చేస్తున్న ధర్మాగ్రహ పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాట్లాలోనే..

– చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి అని చెప్పి మరీ వెళ్లారు. ఎవరికి కృతజ్ఞతలు చెప్పారో చెప్పాలి. ఏ పార్టీ అవిశ్వాసానికి సహకరించాయి.. చంద్రబాబును మోసే జాతీయ పార్టీలు ఏవీ.. మొన్న జరిగిన చర్చలో కనీసం రెండు మాటలు కూడా ఏపీ గురించి మాట్లాడలేదు.

– వైయస్‌ఆర్ సీపీ చేస్తున్న పోరాటాలను చూసి భయపడి.. ప్రజాధరణ వైయస్ జగన్‌కు విపరీతంగా వస్తుందని భయంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైయస్‌ఆర్ సీపీకి అనుకూలంగా దేశం చూస్తుంటే.. తాను కూడా అవిశ్వాసం ప్రవేశపెడుతున్నానని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీకి వెళ్లి తన ప్రసారాల మీడియాలతో జాతీయ పార్టీలన్నీ చంద్రబాబు వంచన చేరాయని రాయించుకున్నారు.

– బీజూపట్నాయక్, హేమామాలిని, మురళీమనోహర్‌జోషి వెనుక ఉన్నారని గొప్పలు ఎల్లోమీడియాలో రాయించుకున్నారు. చివరకు బీజూ పట్నాయక్ పార్టీ ఓటింగ్‌కు కూడా దూరమై వాకౌట్ చేసింది.

– తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్లు మాట్లాడిన మాటలన్నీ నాలుగేళ్లుగా వైయస్ జగన్ వెలుగెత్తి తెలుగులో చెప్పిన మాటలను ఇంగ్లీష్‌లో ఒకరు, హిందీలో ఒకరు మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పూర్తి సమాచారం కూడా లేదని చర్చలో తెలిసింది.

– చంద్రబాబు ఢిల్లీకి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్లారా.. లేక సంధి కోసం వెళ్లారా..? ఎవరైనా అవిశ్వాసం చర్చకు వచ్చిన రోజు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి వెళ్తారు.. అవిశ్వాసం వీగిపోయిన తరువాత కృతజ్ఞతలు బీజేపీకి చెప్పడానికి వెళ్లారా..? లేక కొత్త పొత్తుల కోసం వెళ్లడం జరిగిందా..?

– 2019 ఎన్నికల్లో ఎన్డీయేతో వెళ్లను అని చంద్రబాబు ప్రకటించారు. అంటే భవిష్యత్తులో మళ్లీ వెళ్తాననే అర్థం దాగి ఉంది. బీజేపీకి, టీడీపీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంగా చెప్పారు. బీజేపీతో చేసే లాలూచీ రాజకీయాలు ప్రజలంతా గమనిస్తున్నారు.

– ఆంధ్రప్రదేశ్ విషయంలో 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి మీరు తీసుకున్నది యూటర్నా, లెఫ్ట్ టర్నా.. రౌండ్ టర్నా అని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు.

– ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తరువాత బ్రహ్మాండం అని అర్ధరాత్రి పత్రికా సమావేశంలో పొగడడమే కాకుండా.. అసెంబ్లీలో రెండుసార్లు కేంద్రానికి ధన్యవాద తీర్మానాలు చేసిన మాట వాస్తవమా.. కాదా..?

– ప్యాకేజీ అంగీకరించలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. 2016 సెప్టెంబర్ 9 అసెంబ్లీలో, 2017 మార్చి 16న శాసనమండలిలో ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు.

– ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేశారని అవిశ్వాసం ప్రవేశపెట్టిన వైయస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి భయపడి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.

– తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెట్టి దేశాన్ని కదిలిస్తున్న రోజున వైయస్ జగన్ ఎక్కడున్నారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అవునూ వైయస్ జగన్ ప్రజల్లోనే ఉన్నారు.. ప్రజల్లో ఉంటే చంద్రబాబు పదవికి భూకంపం పుట్టిస్తాడనే భయంతో వైయస్ జగన్‌ను కోర్టుకు లాగింది చంద్రబాబు కుట్ర తప్ప మరొకటి కాదు.

– ఒక్కరోజు కోర్టుకు వెళ్లినా ఆరు రోజుల పాటు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఒకరితో కాదు వేలాది మంది ప్రజల కోసం వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు.

– హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే అని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దితే.. నాలుగున్నరేళ్లుగా అమరావతిలో ఒక్క ఇటుకైనా ఎందుకు వేయలేదు.. దీనికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉంది.

– అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న పంట భూములన్నింటినీ గడ్డిభూములుగా మార్చిన ఘనత చంద్రబాబు సొంతం.

– ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఢిల్లీకి వెళ్లినప్పుడు బీజేపీలో కూడా మొసలం పుట్టిస్తున్నా.. బీజేపీ అసమ్మతి వాదులు నా వెనుకే వస్తున్నట్లు ఎల్లో మీడియాలో చంద్రబాబు లీకులు ఇచ్చారు. బీజేపీ నేతల సపోర్టు ఉంటే ఎందుకు హోదా సాధించలేకపోయారు.

– లోక్‌సభలో నరేంద్రమోడీ ప్రసంగం ఆంధ్రరాష్ట్ర అన్యాయంపై నాలుగు ముక్కలు మాట్లాడారు. కనీసం 5 నిమిషాలు కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన మాటలు మాట్లాడలేదు.

– చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే మిగతా పక్షాలను కూడా ప్రత్యేక హోదా వెలుసుబాటు గురించి మాట్లాడాల్సిందిగా అభ్యర్థించే వారు. కానీ కార్యక్రమం చేయకపోవడం మూలంగా. వారి అజెండాల గురించి మాట్లాడుకున్నారు.

– ఢిల్లీకి వెళ్లినప్పుడు టీఆర్‌ఎస్ ఎంపీ కేకేని కలిశారు. కనీసం టీఆర్‌ఎస్ ఎంపీలు విభజన చట్టం ప్రయోజనాలు కలగడం లేదని బాధపడేవారు కూడా అవిశ్వాస తీర్మానానికి ఓటు వేయలేదు. తెలుగు రాష్ట్రమైన తెలంగాణ వారిని కూడా చంద్రబాబు మేనేజ్ చేయలేకపోయారు. కా గుడితంలో ఎవరున్నా పర్వాలేదని కేకేని కలిస్తే ఇలాంటి పరిస్థితే దాపరిస్తుంది.

– చంద్రబాబు ప్రచారం కోసమే తప్ప ప్రయోజనం కోసం ప్రయత్నాలు జరగలేదు కాబట్టే.. ఈ తతంగం జరిగింది.

– 2018 మార్చి 8న కేంద్రమంత్రి మండలి నుంచి రాజీనామాలు చేసిన చంద్రబాబు నాలుగేళ్లుగా కొనసాగిన తరువాత అవిశ్వాసం పెట్టడం తనపై తాను పెట్టుకోవడం తప్ప మరోకటి కాదు.

– గత నాలుగేళ్లుగా 600లకుపైగా హామీలిచ్చి ప్రజలను వంచించి నాలుగున్నర లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి అవినీతి రాజ్యంగా తీర్చిదిద్దిన చంద్రబాబు తన పాలనపై అవిశ్వాసం పెట్టుకుంటే అర్థవంతంగా ఉంటుంది. చరిత్రలో ఒకరికార్డు అవుతుంది.

– అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా నాలుగేళ్లు మీరు ప్రత్యేక హోదాపైనే అవిశ్వాసం పెట్టారు. హోదాపై మోసం చేసిన కేంద్రంపై పెట్టలేదు.. ఇందుకోసమని ప్యాకేజీ మంచిదని పుస్తకాలు రిలీజ్ చేసిన వ్యక్తులు టీడీపీవారు.

– వైయస్ జగన్ వీరోచితంగా అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉండాలనే ఉద్దేశంతో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా ఆవశ్యతక గురించి ప్రజలను చైతన్యపరుస్తూ.. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేసి అరెస్టు అయ్యారు. రాష్ట్రమంతా అనేక రకాల పోరాటాలు చేశారు. ప్రత్యేక హోదా అనే విషయాన్ని ప్రజల నాలుకల మీద రామనామ జపంలా రాసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చేశారు. అలాంటి పోరాటాలకు మద్దతు ఇవ్వకుండా అనుక్షణం ఉద్యమాలను అణగదొక్కి జైళ్లకు పంపించారు.

– వైయస్ జగన్ రాష్ట్రమంతా తిరిగి గొంతు అలిసేలా మాట్లాడినప్పుడు నిజం కనిపించలేదా..?

– రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గుర్తించి ప్రత్యేక హోదా గళం ఎత్తుతారా చంద్రబాబూ.. ప్రత్యేక హోదా హీరోగా వైయస్ జగన్ మారిపోయారని భయంతో ఎల్లోమీడియాతో దుష్ప్రచారాలు చేస్తున్నారు. వైయస్ జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రజల నుంచి వైయస్ జగన్‌ను వేరు చేయలేరనే నిజాన్ని చంద్రబాబు గమనిస్తే మంచిది.