వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకముందిలక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయికేంద్రంలో ఏ పార్టీతో వైయస్‌ఆర్ సీపీకి పొత్తులు లేవుపదేళ్లుగా ప్రజల మధ్య గడుపుతూ సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్నా..టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికతో వైయస్ జగన్ ప్రత్యేక ఇంటర్వ్యూ
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉందని, అధికారంలోకి రాగానే ప్రజలు మెచ్చే పాలన అందిస్తానని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు వైయస్ జగన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ .. ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్లకే కేంద్రంలో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు . 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తే.. వైయస్‌ఆర్ సీపీ కంటే కేవలం 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయనీ,. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వెల్లువెత్తుతోందన్నారు.. చంద్రబాబు పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు.
రైతు రుణమాఫీ అని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పటికీ బ్యాంకుల్లో రూ. 1.26 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలన్నారు. ఏమైంది? 2014 ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఇచ్చిన బీజేపీ, పవన్‌కల్యాణ్‌లే ఆయన్ను తప్పుబడుతున్నారు.
2014 తర్వాత ప్రత్యేక హోదాను చంద్రబాబు మరిచిపోయారు. ప్యాకేజీ కావాలనడమే కాదు, కేంద్రం ప్రకటననూ బాబు స్వాగతించారు. వైయస్‌ఆర్ సీపీ పోరాటంతో ప్రజల్లో హోదా డిమాండ్ బలంగా పెరిగింది. దీంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని మళ్లీ హోదా అంటున్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకొడానికి ఇతరులపై నెపం నెడుతున్నారు.
అత్యున్నత రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరపకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రంలో ఏ పార్టీతో వైయస్‌ఆర్ సీపీకి ఒప్పందంగానీ, పొత్తుగానీ లేవు. కానీ చంద్రబాబే పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారు. పదేళ్లుగా ప్రజల మధ్య గడుపుతున్నా.. వారి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్నా.. పాదయాత్రలో భాగంగా కొన్ని లక్షల మందిని నేరుగా కలుస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న నమ్మకముంది. అధికారంలోకి రాగానే ప్రజలు మెచ్చే పాలన చేస్తా.