'వ్యవసాయ బడ్జెట్‌ పేరుతో ప్రభుత్వం దగా'

హైదరాబాద్, 20 మార్చి 2013: వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెడతాం అ‌ని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతులను  నిలువునా దగా చేసిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ రైతు విభాగం ‌నిప్పులు చెరిగింది. మోసపూరితంగా వ్యవహరించిన ప్రభుత్వం తీరును పార్టీ రైతు విభాగం తీవ్రంగా ఖండించింది. పార్టీకి చెందిన వివిధ జిల్లాల రైతు విభాగం నాయకులు బుధవారంనాడు కేంద్ర కార్యాలయంలో సమావేశమై వార్షిక ప్రణాళికపై చర్చించారు.

బడ్జెట్‌కు - వార్షిక ప్రణాళికకు తేడా తెలియకుండా వ్యవసాయశాఖ మంత్రి వ్యవహరించడం దారుణమని పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్‌. ‌నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. రైతు సమస్యలను తమ పార్టీ ఏనాడూ రాజకీయ సమస్యగా పరిగణించలేదని ఆయన అన్నారు.
Back to Top