హైదరాబాద్: వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతి తెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల వెల్లడించారు. <br/>