పార్టీలు మారినవారు కూడా నీతులు మాట్లాడుతున్నారురాజీనామా చేసి సత్తా చాటుకోవాలని మిథున్ రెడ్డి సవాల్బలవంతంగా పచ్చకండువా కప్పారు..వైయస్సార్సీపీలోనే కొనసాగుతానువైయస్ జగన్ ను సీఎం చేసేవరకు పోరాడుతాం..వైయస్సార్సీపీ ఎంపీపీ విమల
చిత్తూరుః ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి పోయి నీతులు చెప్పడం కాదని...దమ్ముంటే పదవికి రాజీనామా చేసి సత్తా చూపాలని వైయస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. ఎవరి అభివృద్ధి చూసి పోతున్నారని ఫిరాయింపుదారులను ప్రశ్నించారు. ప్రజలకు జరగని అభివృద్ధి మరెక్కడ జరిగిందో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని టీడీపీ నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు. కొద్ది ఓట్ల మెజార్టీతో గెలిచిన టీడీపీ పాలనలో ఘోరంగా విఫలమైందని మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ విమల వైయస్సార్సీపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల సమక్షంలో తిరిగి వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడారు.
వైయస్సార్సీపీలోకి ఎంపీపీ విమలపలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తన కుమారుడి ఫంక్షన్ కోసమని తీసుకెళ్లి తమ చేత బలవంతంగా పచ్చకండువాలు కప్పించారని బైరెడ్డిపల్లి ఎంపీపీ విమల తెలిపారు. తన ప్రమేయం లేకుండా జరిగిందని, తనను క్షమించాలని కోరారు. తిరిగి సొంత పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ప్రచార నిర్వహణలో వైయస్ జగన్ పార్టీకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించానని చెప్పారు. తాను వైయస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి... జగన్ అన్న ఆశయాల మేరకు పార్టీ పరంగా ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైయస్ జగన్ ను సీఎం చేసేంతవరకు పోరాటం కొనసాగుతోందని తెలిపారు.
టీడీపీ డబ్బులకు లొంగేది లేదని, అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదురొడ్డి పోరాడుతామని ఎంపీటీసీలు, సర్పంచ్ లు తేల్చిచెప్పారు. వైయస్సార్సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి చివరి వరకు పోరాడుతామన్నారు. పలమనేరులో వైయస్సార్సీపీ బలంగా ఉందని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.