<br/>అమరావతి: జననేత వైయస్ జగన్ హత్యకు ప్రయత్నించిన కోడి కత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘వెయ్యిగొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. పింగళి దశరథ రామ్‌ను, రాఘవేంద్ర రావును, మల్లెల బాబ్జీని, వంగవీటి రంగాను చంపించిన, ఇంకా ఎంతోమంది హత్యలకు పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు. కానీ జననేత వైయస్ జగన్ హననానికి ప్రయత్నించిన కోడికత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.<br/>తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులందరికీ నాయుడు బాబే ఫైనాన్షియర్ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ రాహుల్‌గాంధీ దూతగా అమరావతికి వచ్చి చంద్రబాబుతో జరిపిన భేటీ వెనుక రహస్యమిదేనని ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద రూ. వెయ్యి కోట్లు పెట్టడానికి డీల్ కుదిరిందని, ఈ సొమ్మంతా పాలు, కూరగాయలు అమ్మతే వచ్చిన లాభం కదా! అంటూ చంద్రబాబును వ్యంగ్యంగా ప్రశ్నించారు.<br/>