విజయమ్మ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : శంకర్రావు

హైదరాబాద్­, 27 ఆగస్టు 2012 : 'దివంగత వైయస్­ రాజశేఖరరెడ్డి తిరిగివస్తే ఆయన కళ్ళలోకి చూసే ధైర్యం మంత్రులకు ఉందా?' అని వైయస్­ఆర్­ కాంగ్రెస్­ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి పి. శంకర్రావు ఏకీభవించారు. విజయమ్మ వ్యాఖ్యల్లో వక్రీకరణ లేదు, వ్యంగ్యం లేదని పేర్కొన్నారు. ఒకవేళ అలా ఎవరైనా వైయస్­ వైపు చూస్తే బూడిదైపోతారని ఆయన అన్నారు. మరణించిన వారిపై అభియోగాలు మోపడం సరికాదన్నారు. మరణించిన వారిపై అభాండాలు వేయడాన్ని ఏ మతమూ ఒప్పుకోదని, దేవుడు కూడా సహించబోడని ఆయన అన్నారు. మంత్రులు తప్పు చేసి, ఈ నెపాన్ని వైయస్­ రాజశేఖరెడ్డిపైకి నెట్టడం సరికాదని శంకర్రావు అన్నారు. వైయస్­ను విమర్శిస్తే ప్రజలు సహించబోరని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్­ను విమర్శించినందువల్లే కాంగ్రెస్­ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిందని శంకర్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కనువిప్పు కలగటం లేదన్నారు.

తాజా ఫోటోలు

Back to Top