విద్యార్థినులలో స్ఫూర్తి నింపిన విజయమ్మ

పులివెందుల, 3 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విద్యార్థినులలో స్ఫూర్తి నింపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని వారికి ఆమె పిలుపునిచ్చారు. ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు అన్నది వారికి అర్థమయ్యేలా వివరించారు. పులివెందుల నియోజకవర్గంలో బుధవారంనాడు విజయమ్మ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.  

పులివెందుల జిల్లాపరిషత్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయమ్మ విద్యార్థినిలకు భోజన ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. ఇదే పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదువుకున్న విజయమ్మ‌ కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా విద్యార్థులంతా బాగా చదివి పైకి రావాలని పిల్లల్లో స్ఫూర్తి నింపారు. ప్రతి విద్యార్థిని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని కృషి చేయాలని కోరారు. అనంతరం వేంపల్లె మండలంలోని కుమ్మరాంపల్లె ప్రా‌థమిక పాఠశాలను సందర్శించిన విజయమ్మ ఆ పాఠశాల అదనపు నూతన తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడిన విజయమ్మ విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలని కోరారు.
Back to Top