పన్నుల పెంపును నిరసిస్తూ లీలాకృష్ణ నిరాహారదీక్ష

తూర్పుగోదావరిః  పెంచిన ఇంటి పన్నులు వెంటనే తాగ్గించాలి డిమాండ్ చేస్తూ  మండపేట కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ  నిరాహార దీక్ష చేపట్టారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చేంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పన్నుల పెంపుదల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదని అనడం హాస్యాస్పదమన్నారు. అంతే కాకుండా గ్రామీణ ప్రజలపై మోపిన పన్ను భారాన్ని తగ్గించకుండా తప్పించుకునే  దిశగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతమంది చంచాగాళ్ళతో కలిసి ప్రజలను పన్నుల రూపంలో పీడిస్తే చూస్తూ సహించేదిలేదన్నారు. ఈ నిరాహార దీక్షలో పడాల సతీష్,కేశవరం ఎమ్.పి.టి.సి తుపాకుల ప్రసన్నకుమార్, సోమేశ్వరం ఎమ్.పి.టి.సి పేకేటి ఈశ్వరరావు,తాతపూడి m p t c కొప్పిశెట్టి శ్రీనివాస్ మరియు గంగుమళ్ళ రాంబాబు ఎస్.జయంత్,మేడపాటి బసివిరెడ్డి,బూరా అమ్ములు తదితరులు పాల్గొన్నారు.

Back to Top