జగన్నాధానికి వాసిరెడ్డి పరామర్శ

తెర్లాం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా క్రమ శిక్షణా కమిటీ సభ్యుడు, లోచర్ల మాజీ సర్పంచ్‌ మ్రరాపు జగన్నాధంను పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు(రాంబాబు) బుధవారం మధ్యాహ్నం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా మ్రరాపు జగన్నాధం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి రాంబాబు లోచర్లలోని జగన్నాధం ఇంటికి వచ్చారు.  ఈ సందర్భంగా జగన్నాధం ఆరోగ్య పరిస్ధితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. మ్రరాపు జగన్నాధం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బొబ్బిలి మున్సిపల్‌ మాజీ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఇంటి గోపాలరావు, వెలగవలస, తెర్లాం, లోచర్ల మాజీ సర్పంచ్‌లు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top