ప్రారంభమైన వంచనపై గర్జన..

కాకినాడః ఏపీకి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయంపై వైయస్‌ఆర్‌సీపీ తలపెట్టిన వంచన గర్జన నిరసన కార్యక్రమం సర్వమత  ప్రార్థనలతో ప్రారంభమయింది. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు. ఈ  దీక్షల్లో వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు,వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్‌ కోఆర్డీనేటర్లు, నేతలు పాల్గొంటున్నారు. హోదాపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసగా నల్లదుస్తులతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు హాజరయ్యారు.ప్రత్యేకహోదాపై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోరాట వివరాల బ్రోచర్‌ను వైయస్‌ఆర్‌సీపీ విడుదల చేశారు.అధిక సంఖ్య వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం వరకు ఈదీక్ష కొనసాగనుంది.

Back to Top