'వైయస్ సొంత మనిషిలా చూసేవారు'

ఆత్మకూర్ (మహబూబ్‌నగర్):

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి తనను ఎంతో అభిమానించి స్వంతవ్యక్తిలా భావించేవారనీ, ఈ కారణంగానే తాను  వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరాననీ అమరచింత మాజీ ఎమ్మెల్యే సల్గూటి స్వర్ణ సుధాకరరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ కార్యాలయంలో శుక్రవారం పార్టీలో చేరిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.  మక్తల్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలని విజయమ్మ సూచించినట్లు నాయకులు పేర్కొన్నారు. ఆమెతో పాటు మ రో వందమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. స్వర్ణమ్మ 2004 ఎన్నికల్లో అమరచింత అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆత్మకూర్, నర్వ, చిన్నచింతకుంట, దే వరకద్ర, ధన్వాడ మండలాల్లో మంచిపట్టు సా ధించి సమీప అభ్యర్థి కొత్తకోట దయాకర్‌రెడ్డిపై గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు అమరచింత నియోజవర్గం పునర్విభజన కావడంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి స్వర్ణమ్మను దేవరకద్ర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రకటించారు. మండలాలు మారడంతో పా టు వర్గపోరు, సమన్వయ లోపం తదితర కారణాల వల్ల టీడీపీ అభ్యర్థి సీతమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీలో చేరిన కార్యక్రమంలో పార్టీ గద్వాల నేతలు కృష్ణమోహన్‌రెడ్డితోపాటు పార్టీ జిల్లా అడ్‌హాక్ కమిటీ సభ్యులు మండ్ల రామకృష్ణ, నాగేందర్‌రెడ్డి, ఆరేపల్లి రాంరెడ్డి, మండ్ల రాము, కత్తేపల్లి విష్ణువర్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాచాల రాజు, రాజుయాదవ్, రాజు, మచ్చందర్‌గౌడ్, సత్యన్న, ఆటోరవి, మున్నూరు శ్రీను, మధు, నర్సింహ్మచారి, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top