వైయస్‌ఆర్‌తో బాబుకు పోలికే లేదు: సబ్బం హరి

విశాఖపట్నం, 29 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రతో చంద్రబాబు చేసిన పాదయాత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, అస్సలు పోలికే లేదని అనకాపల్లి ఎం.పి. సబ్బం హరి వ్యాఖ్యానించారు. మహానేత వైయస్‌ఆర్ ఉదయం 5‌ గంటలకే నిద్ర లేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై పాదయాత్ర చేశారని ఆయన గుర్తుచేశారు. మనుషులు తిరగని రాత్రి సమయంలో బాబు చేసిన పాదయాత్రకు వచ్చిన వారంతా తీసుకువచ్చిన జనమే అన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరూ చంద్రబాబు మీద అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చిన వారు మాత్రం కానే కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ మినహా ఇతర ఏ పార్టీ ‌సిబిఐని విశ్వసించటం లేదని సబ్బం హరి అన్నారు.
Back to Top