వైయస్‌ఆర్‌సిపిలో చేరిన జలగం వెంకట్రావు

ఖమ్మం, 19 నవంబర్ 2012: సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు‌ సోమవారంనాడు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌లో చేరారు. వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ‌యన పార్టీలో చేరారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ గ్రౌం‌డ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ‌ సభా వేదికపైన విజయమ్మ వెంకట్రావు, తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. జలగం వెంకట్రావుతో పాటు పలువురు జిల్లా ప్రముఖులు కూడా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌లో చేరారు.
Back to Top