వైయస్‌ఆర్ సీపీలో వెల్లువలా చేరికలు

నారనాగేపల్లి: మండల పరిధిలోని నారనాగేపల్లి గ్రామంలో చేపట్టిన గడప గడపకూ వైయస్‌ఆర్ సీపీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మంగళవారం ఎం.కొత్తపల్లి, నారనాగేపల్లిల్లో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వం నమోదు చేయించుకోవాలని గ్రామస్తులను కోరారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవేశ పెట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నారనాగేపల్లిలో టీడీపీ నాయకులు కమ్మర రామన్న, లక్ష్మమన్న, వెంకటరాముడు, క్రిష్టప్ప, తదితరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వీరితో పాటు టీ డీపీ, కాంగ్రెస్‌కు చెందిన 36 కుటుంబాల కార్యకర్తలు జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నరసింహులు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ రమణరెడ్డి సోదరి సానే ఉషారాణి, కన్వీనర్ కాటిమ తిమ్మారెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు నాయకుల సమక్షంలో పార్టీ క్రీయశీల సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీ నాయకుడు రామన్న మాట్లాడుతూ తాము 30 ఏళ్లుగా ఆ పార్టీలో పని చేసినా తగిన గుర్తింపు లేదన్నారు. ముఖ్యంగా వైయస్‌ఆర్ ప్రవేశ పెట్టిన అనేక పథకాల ద్వారా తాము కూడా లబ్ధి పొందామన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, తామంతా జగనన్న నాయకత్వంలో పని చేయడానికే వైయస్‌ఆర్ సీపీలో చేరుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆర్ మహేశ్వరరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు చంద్రశేఖర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాసరి రామాంజినేయులు, ప్రధాన కార్యదర్శి గోవిందప్ప, ఆర్ లోచెర్ల బోయ రామాంజినేయులు, మైనార్టీ నాయకుడు అమీర్ పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో..
ఆలమూరు: మండలంలోని మూలస్థానం అగ్రహారం, కలవచర్ల గ్రామాలకు చెందిన సుమారు వెయ్యిమంది  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ నేత, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మూలస్థానం అగ్రహారం శివారు ఇందిరా కాలనీ, కలవచర్ల గ్రామాల్లో పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాసు ఆధ్వర్యంలో తోరాటి చక్రవర్తి, తోరాటి సత్తిబాబు, యిల్లూరి నాగరాజు నాయకత్వంలో వివిధ పార్టీలకు చెందిన వారు చేరారు. వీరిలో 300 మంది వరకూ మహిళలు ఉండటం గమనార్హం. వీరందరికి జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

అమలాపురంలో వందమంది చేరిక
అమలాపురం : అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లి పంచాయతీ పరిధిలోని అంబటివారిపేటకు చెందిన సుమారు వంద మంది మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ కేంద్ర క్రమ శిక్షణా కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో విప్పర్తి దుర్గా వెంకట రమణ, కొండ్రు మహేశ్వరరావు, నక్కా పెదసత్యనారాయణ, గోసంగి కుటుంబ రావు, నక్కా ప్రకాశరావు, విప్పర్తి కృష్ణమూర్తిల నాయకత్వంలో ఈ చేరికలు జరిగాయి. 

Back to Top