వైయస్ఆర్ కుటుంబంపై కుట్ర

తాండూర్: దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై కుట్రను ప్రతీ కార్యకర్త తిప్పికొట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు సాయిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ తాండూరు మండల కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ సాబీర్‌ హుస్సేన్ అధ్యక్షతన స్థానిక ఆదర్శ గార్డెన్‌లో ఏర్పాటైంది. ముఖ్య అతిథిగా హాజరైన సాయిరెడ్డి మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డి, వైయస్ కుటుంబంపై కుట్ర చేస్తున్నాయన్నారు. జగన్‌ను జైలులోంచి బయటకు రాకుండా చూస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌ రెడ్డిపై చేస్తున్న విషప్రచారాన్ని కార్యకర్తలు మూకుమ్మడిగా తిప్పికొట్టాలన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలన్నారు. 
తొలిసారిగా మండలానికి వచ్చిన సాయిరెడ్డిని పార్టీ నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ, మండల ఉపాధ్యక్షుడు పుట్ట శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు లక్ష్మణ్, బీసీ సెల్ అధ్యక్షుడు మురళి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గొడిశెట్టి లక్ష్మణ్, యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్, రామచంద్ర పఠాన్, పోశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top