వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరిన చెంగల

హైదరాబాద్: తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ కార్యాలయంలో ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో  పార్టీలో చేరారు.  పాయకరావు పేట నియోజకవర్గానికి ఆయన గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. మరోవంక పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్(కాంగ్రెస్) విజయమ్మతో భేటీ అయ్యారు. 
పార్టీ ఆశయాలకు ఆకర్షితులయ్యారు: బాబూరావు
వైయస్ఆర్ పార్టీ ఆశయాలు, మహానేత సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడమే కాకుండా, సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసించలేని చంద్రబాబు వ్యవహారశైలికి విసిగి చెంగల వెంకట్రావు పార్టీలో చేరారని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు పలువురు పార్టీలో చేరారన్నారు. పార్టీ ఆశయాలకు ఆకర్షితులై వచ్చిన వెంకట్రావును తాను ఆహ్వానించానన్నారు.
కాంగ్రెస్ తో బాబు కుమ్మక్కయ్యారు: వెంకట్రావు
పాయకరావు పేట తెలుగుదేశం ఎమ్మెల్యేగా 1999నుంచి పదేళ్ళు వ్యవహరించానని చెంగల వెంకట్రావు విలేకరులకు చెప్పారు. 14ఏళ్ళు టీడీపీలో ఉన్నా తనకు సరైన ప్రాధాన్యత లభించలేదన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు. అందరికీ అందేలా చూశారన్నారు. కిందటి ఉప ఎన్నికలలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు వైఖరిలో మార్పు రాలేదన్నారు. గొల్ల బాబూరావు కిందటి ఉప ఎన్నికలలో 14వేల మెజార్టీతో గెలిచారంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పై ప్రజలకు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతోందన్నారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెసు పార్టీలో కలిపారనీ, చంద్రబాబు అలాకాకుండా కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనీ ధ్వజమెత్తారు. తద్వారా వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నారనీ, జగన్మోహన్ రెడ్డిని జైలు పాలుచేశారనీ ఆరోపించారు. నేను పదవులకోసం వైయస్ఆర్ సీపీ చేరలేదనీ, కార్యకర్తగా ప్రజలకు సేవ చేసేందుకు చేరాననీ చెంగల విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top