వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ దే విజయం

పెద్దవడుగూరు: రాష్ట్రంలో 2014లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలపరిధిలోని కాశేపల్లి, గుత్తి అనంతపురం గ్రామాల్లో ‘గడప గడపకు వైఎస్సార్‌ సీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, జిల్లా ముఖ్యనేత ఎర్రిస్వామిరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుశీలమ్మ, తాడిపత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వీఆర్ రామిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గూడూరు సూర్యనారాయణరెడ్డి, పాశం రంగస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ పథకాలు కొనసాగాలంటే జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావడానికి జిత్తుల మారి వేషాలు వేస్తున్నారని విమర్శించారు. వాటిని ప్రజలు నమ్మబోరన్నారు. కాంగ్రెస్ నాయకులు తాడిపత్రి నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం, అక్కడ అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయించడం వంటి నీచమైన పనులు చేసున్నారని పైలా నర్సింహయ్య దుయ్యబట్టారు. సుశీలమ్మ మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గానికి జేసీ సోదరులు శనిలా దాపురించారని దుయ్యబట్టారు. ఎవరిని భయపెట్టినా, ఎన్ని అక్రమాలు చేసినా 2014లో వారి ఓటమి ఖాయమన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పదవులు కాపాడుకునేందుకే సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం తాగునీటి సమస్య కూడా పరిష్కరించడం లేదన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి, తాడిపత్రి యూత్ నాయకులు కంచం రామ్మోహన్‌రెడ్డి, పేరం మహేశ్వరరెడ్డి, తాడిపత్రి మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, పట్టణ కన్వీనర్ సలాం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చిరంజీవి, మీసాల రంగన్న, మండల నాయకులు వెంకటస్వామిగౌడ్, శేషారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, కాశేపల్లి చల్లారామకృష్ణారెడ్డి, ఆవులాంపల్లి భాస్కర్‌రెడ్డి, గుత్తిఅనంతపురం గోవర్దన్‌రెడ్డి, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి చేరికల వెల్లువ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించడంతో తామంతా వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నామన్నారు. వైఎస్ పథకాల కొనసాగింపు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని వారు ప్రతినబూనారు.
200 మంది చేరిక
రొళ్ల: మండలంలోని చిగమతిఘట్ట, బంద్రేపల్లి, ఎం రాయాపురం, హునిసేకుంట, హెచ్ టీ హళ్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు 200 మంది వైఎస్సార్‌సీపీలో చేరా రు. పాతన్న, దయానంద, రంగనాథ్, రాజన్న, తి మ్మరాజు, హనుమంతరాయప్ప, నరసింహమూర్తి, నరసప్ప, రాజన్న, రంగప్ప, చిక్కహనుమేగౌడ్, శివకుమార్, రాజణ్ణ, నాగరాజు, క్రిష్టప్ప, నారాయణప్ప, రెడ్డప్ప, సుబ్బరాయప్ప, హోటల్ తిమ్మప్ప, వెంకటరమణప్ప, యంజారప్ప, చంద్రశేఖర్, జే రంగప్ప, శంకర్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరిని మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో అగళి, రొళ్ల మండలాల కన్వీనర్లు శివారెడ్డి, స్టూడియో శ్రీనివాస్, నాయకులు మల్లేగౌడ్, జయరామిరెడ్డి, విజయరంగేగౌడ్, న్యాయవాది రంగనాథ్, నరసింహరెడ్డి, డీపీ నారాయణ, అశ్వర్థరెడ్డి పాల్గొన్నారు.
చిన్నజలాలపురంలో 
శింగనమల: చిన్నజలాలపురం గ్రామంలో ఆదివారం టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్‌కు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో గోవిందరాయునిపేట మాజీ వార్డు సభ్యుడు వెంకటేశు, పెద్ద వెంకటేశు, బజారు వెంకటేశు, రుషింగప్ప, చిన్నజలాలపురం సీపీఎం కార్యకర్త ఓబిలేసు, మట్లగొంది టీడీపీ కార్యకర్తలు కంబగిరిస్వామి, లింగమయ్య, వెంకటరాముడు, జెన్నే ఆంజనేయులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నల్లప్ప, సీనియర్ నాయకులు చిన్న నారపరెడ్డి, శ్రీరామిరెడ్డి, అలూరి రమణారెడ్డి, సూరి నారాయణ, శివారెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, జయరాముడు, పెద్దన్న, నరసింహులు, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
తాను వైఎస్సార్‌సీపీలో చేరుతానని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి ప్రకటిం చారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం శింగనమలలోని రా మాలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించా రు. అక్టోబర్ పదో తేదీన తరిమెల గ్రామంలో తన అనుచరులు, శ్రేయోభిలాషులతో కలిసి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఈసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీ తీ ర్థం పుచ్చుకుంటామన్నారు.
మహిళలు, రైతులు, కూలీలతోపా టు తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలంలో ని అనుచరులు కూడా భారీ సంఖ్యలో పార్టీలో చేరుతున్నట్లు తెలి పారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమి టీ సభ్యుడు మరువ పల్లి ఆదినారాయణ, శింగనమల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తరిమెల రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కేశవరెడ్డితోపాటు మధుసూధన్‌రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
జగన్‌ను జైలుకు పంపడం రాజకీయ కుట్ర
హిందూపురంరూరల్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు రాజకీయ కుట్ర పన్ని జగన్‌మోహన్‌రెడ్డిని జైలుకు పంపారని వైఎస్సార్‌సీసీ హిందూపురం నాయకులు జీవీపీ నా యుడు, గంపల వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండూరు వేణుగోపాలరెడ్డి, చౌళూరు రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో ఆదివారం నిర్వహించిన పట్టణ, రూరల్ వైఎస్సార్‌సీపీ సభ్యత్వ నమోదు సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లతో పాటు చోటా నాయకులు సైతం దివంగత వైఎస్‌ఆర్ పై విమర్శలు చేయడంతో విసుగు చెందిన జగన్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని స్థాపించారన్నారు. ఏడాది నుంచి పార్టీ కార్యక్రమాలు, ప్రజాపోరాటాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం పొందడంతో రాజకీయకుట్ర పన్ని జగన్‌ను జైలులో పెట్టించారన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధిక సీట్లలో వైఎస్సార్ సీపీని గెలిపించారంటే జగన్‌పై ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థమౌతుందన్నారు.
ఈనెల 28న వెలువడే కోర్టు తీర్పు జగన్‌కు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ తరుణంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని ఈనెల 30లోగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలని కోరారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ ఏ, బి బ్లాక్ కన్వీనర్లు ఫైరోజ్, గోపీకృ ష్ణ, బీసీ సెల్, మైనార్టీసెల్ నాయకులు రంగప్ప, సలీంబాషా,రొద్దం మున్నా, రహమాన్‌లు పాల్గొన్నారు.


Back to Top