ఉన్నత విద్యకు దూరమవుతున్నాం

ఖమ్మం, 27 ఏప్రిల్ 2013:

ఖమ్మం పట్టణంలోని మమతా మెడికల్ కాలేజీ విద్యార్థులతో శ్రీమతి వైయస్ షర్మిల శనివారం ఉదయం సమావేశమయ్యారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారంనాడు ఖమ్మం పట్టణంలో పర్యటించిన సంగతి తెలిసింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అమలు చేసిన ఫీజు రీయింబర్సుమెంటు పథకం తమకెంతో ఉపయోగపడిందని విద్యార్థినులు శ్రీమతి షర్మిలకు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్థ విధానాల కారణంగా తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యకు దూరమవుతున్నామని చెప్పారు. పేదలు కూడా ఉన్నత చదువులు అభ్యసించాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అభిలషించారని శ్రీమతి షర్మిల వారికి తెలిపారు. పేద విద్యార్థుల కోసమే ఫీజు రీయింబర్సుమెంటు అమలుచేశారని చెప్పారు. జగనన్న సీఎం కాగానే వైయస్ఆర్ పథకాలన్నింటినీ అమలుచేస్తారని భరోసా ఇచ్చారు.

Back to Top