టీడీపీ రాజ్యాంగ విరుద్ధ పాలన

శాసనసభలు, న్యాయస్థానాలు, ప్రజల పట్ల..
ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదు
అధికారంలోకి వచ్చిన నాటినుంచి..
టీడీపీకి అంహకారం తలకెక్కిందిః రాచమల్లు

హైదరాబాద్ః అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి 'టీడీపీ అహంకారం తలకెక్కి ఇష్టానుసారం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం, సస్పెన్షన్ ఎత్తివేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. జరిగిన అన్యాయంపై రోజా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే...సస్పెన్షన్ చట్టవిరుద్ధమని కోర్టులు స్పష్టంగా తేల్చాయన్నారు.

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, మేం  ఆందోళన చెందుతున్నామని కోర్టులు చెబుతున్నాయంటే... ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సుప్రీం ఆదేశాల మేరకు హైకోర్టు విచారణకు తీసుకొని...  సస్పెన్షన్ చెల్లదని తేల్చిచెప్పిందని రాచమల్లు ప్రభుత్వానికి తెలియజెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సస్పెండ్ చేశారని న్యాయస్థానాలు తేల్చాయన్నారు. ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను అవమానించడం న్యాయస్థానానికి చేసిన అగౌరవంగా భావిస్తున్నామన్నారు.

శాసనసభ్యులంతా న్యాయస్థానాన్ని, రాజ్యాంగాన్ని, మహిళను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఏ కారణంతో మీరు రోజాను సభకు రానీయడం లేదు. ఆమె ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని బాధపడుతున్నారా..? ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుందని భయపడుతున్నారా..? లేక మీ పార్టీ వీడిందనా...?  మీ అవినీతి చీకటి బాగోతాల్ని విప్పి చెబుతుందని ఆందోళన చెందుతున్నారా..? ఏ కారణంతో అనుమతించలేదు. ఓ మహిళా శాసనసభ్యురాలి పట్ల మీకెందుకంత అసూయ అని రాచమల్లు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

మా ఎమ్మెల్యేలను ప్రలోభాలతో  కొనుగోలు చేశారు. స్థానికసంస్థలు పట్ల, శాసనసభలు, న్యాయస్థానాలు, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదన్నారు. హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఎంతసేపు వాళ్ల పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవడం .విచ్చలవిడిగా దోచుకోవడం. దోచుకున్నదాంతో రాజకీయాలు చేయడం తప్ప టీడీపీ మరేమీ చేయడం లేదని ఫైరయ్యారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, కోర్టులను ధిక్కరిస్తూ, శాసనసభా నియమాలను తుంగలో తొక్కుతున్న టీడీపీ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని...రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
Back to Top