తుఫాను నష్టంపై వైయస్ఆర్‌సీపీ సమావేశం

హైదరాబాద్

8 నవంబర్ 2012: నీలం తుఫాను దరిమిలా సంభవించిన అపార నష్టంపై చర్చించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు లోటస్‌పాండ్‌ పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. గౌరవాధ్యక్షురాలు వై.యస్. విజయమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా తుఫాను బాధితులకు అందవలసిన పరిహారం, సహాయంపై చర్చిస్తారు. పార్టీ పరంగా చేపట్టవలసిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.

Back to Top