రాజధాని చాటున ఏం జరుగుతోంది..!

చంద్రబాబు ఆలోచనల మేరకు సాగుతున్న నాటకాలు

సింగపూర్ కంపెనీలకు సర్వస్వం అప్పగింత
దశల వారీగా సాగుతున్న మోసాల బాగోతం

విజయవాడ: అమరావతి లో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నాటి నుంచి చంద్రబాబు మార్కు డ్రామాలు కొనసాగుతున్నాయి. అదిగదిగో అద్భుతాలు అని గ్రాఫిక్ మాయాజాలాన్ని చూపిస్తూ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు. తెర చాటున సింగపూర్ కంపెనీలకు సర్వస్వం దోచిపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

చంద్రబాబు మార్కు
అమరావతి రాజధానిని సింగపూర్ ప్రభుత్వమే నడుపుతుందని చంద్రబాబు ప్రచారం చేసుకొన్నారు. పచ్చమీడియాలో దీని మీద కథనాలు మోతెక్కించారు. తర్వాత అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకొంటున్నట్లు హడావుడి చేశారు. అంతా సింగపూర్ మార్కు నిర్మాణాలు ఉంటాయని గ్రాఫిక్సులతో కనికట్టు చేశారు.

అంతా ప్రైవేటు పరం
తీరా చూసి మాస్టర్ ప్లాన్ విడుదల సమయం వచ్చేసరికి మాత్రం అసలు గుట్టు క్రమంగా వీడుతోంది. సింగపూర్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని విషయంగా ఇది తేలిపోయింది. అక్కడి ప్రైవేటు సంస్థలే దీన్ని చేపడుతున్నట్లు అర్థం అయింది. ఇందుకోసం విడి విడిగా ఏర్పాటైన సంస్థలు కలిసిపోయి కన్సార్టియం మాదిరిగా ఏర్పడ్డాయి.

కొత్త అవతారంలో సీఈవో
సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థగా అమరావతి ఒప్పందం మీద సంతకం పెట్టిన టో యెంగ్ నేరుగా ముందుకు కదిలారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ప్రైవేటు కంపెనీలకు అప్పగించేశారు. అంతేకాదు, తాపీగా దీన్ని సెటిల్ చేసుకొన్నాక రాజీనామా చేసేశారు. అదే ప్రైవేటు కంపెనీ సుర్బానా-జురాంగ్ కు సీఈవో గా చేరిపోయారు. అంటే కేటాయింపులు చేసేశాక, అదే కేటాయింపులు పుచ్చుకొన్న కంపెనీలో చేరారన్న మాట. దీన్ని బట్టి ఏ మేరకు నాటకాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

Back to Top