మొద‌టి రోజు వైయస్ జ‌గ‌న్ టూర్ షెడ్యూల్‌

అనంత‌పురం) ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ అనంత‌పురం జిల్లా లో రైతు భ‌రోసా యాత్ర నిర్వ‌హించనున్నారు. ఆయ‌న మొద‌టి రోజు ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ను పార్టీ వ‌ర్గాలు విడుద‌ల చేశాయి.
మొద‌ట‌గా తాడిప‌త్రి నియోజ‌క వ‌ర్గం మిడుతూరు నుంచి పర్య‌ట‌న మొద‌ల‌వుతుంది. అక్క‌డ నుంచి పెద్ద‌వ‌డ‌తూరు చేరుకొంటారు. అక్క‌డ రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తారు. త‌ర్వాత చిన్న‌వ‌డుగూరు మీదుగా దిమ్మ‌గుడి చేరుకొని అక్క‌డ ఆత్మ‌హ‌త్య చేసుకొన్న రైతు నాగార్జున రెడ్డి కుటుంబాన్నిప‌రామర్శిస్తారు. రైతుకుటుంబానికి భ‌రోసా క‌ల్పిస్తారు. స్థానికుల‌తో ప‌రిస్థితుల మీద మాట్లాడ‌తారు.
మ‌ధ్యాహ్నం కండ్ల‌గూడూరు మీదుగా చింత‌ల చెరువు చేరుకొంటారు. అక్క‌డ ఆత్మ‌హ‌త్య చేసుకొన్న జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, వెంక‌ట్రామిరెడ్డి కుటుంబాల్ని ప‌రామ‌ర్శిస్తారు. మొద‌టి రోజు జ‌న నేత వైయ‌స్‌జ‌గ‌న్ మూడు కుటుంబాల్ని ప‌రామ‌ర్శించ‌నున్నారు. 
Back to Top