టీడీపీ నేత నుంచి నాకు ప్రాణహాని

వైయస్‌ఆర్‌ సీపీ సర్పంచ్‌ రామ్మోహన్‌ పోలీసులకు ఫిర్యాదు
కూడేరు: తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ప్రాణహాని వుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండ తాండా సర్పంచ్‌ రామ్మోహన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఉదిరిపికొండ తాండా చెందిన టీడీపీ నాయకుడు రవినాయక్‌ తనపై తన కుటుంబ సభ్యులపై దాడి చేశాడని కూడేరు పోలీసులకు రామ్మోహన్‌ ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే రవినాయక్‌ తన ఇంటి వద్దకు వచ్చి తనను దుర్భాషలాడుతు దాడి చేశాడని ఎస్‌ఐ రాజుకు వివరించారు. అభివృద్ధి పనులు చేయనివ్వకుండా రవినాయక్, తన అనుచరులు తనను అడ్డుకుంటున్నారని చెప్పారు. రవినాయక్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 
Back to Top