తమ్మినేని ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళంః శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైయస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆత్మహత్యాయత్న చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు కంప్యూటర్లు దగ్ధమయితే.. వైయస్సార్సీపీ నేతలే చేశారంటూ పోలీసులు కేసు ఫైల్ చేయడం పట్ల  తమ్మినేని సీతారం ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు కావాలనే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. వెంటనే వైయస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రత్యేకహోదా కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై ...పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తమ్మినేని సీతారాం, వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఖాకీల తీరును నిరసిస్తూ ఆముదాల వలస పీఎస్ వద్ద నిరసన చేపట్టారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top