థాక్రే మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్:

శివసేన పార్టీ వ్యవస్థాపకుడూ, సామ్నా పత్రిక సంపాదకులూ బాల్ థాక్రే మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వై.యస్. విజయమ్మ ఓ ప్రకటనలో సంతాపం ప్రకటించారు. అనేక ప్రజా పోరాటాలూ, ఉద్యమాల ద్వారా అర్ధ శతాబ్దం పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. దేశ రాజకీయాలలో సైతం ఆయన తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారన్నారు. పాత్రికేయుడిగా, కార్టూనిస్టుగా థాక్రే తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు విజయమ్మ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. థాక్రే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Back to Top