'తెలంగాణలో బలపడుతున్న వైయస్‌ఆర్‌సిపి'

మందమర్రి (ఆదిలాబాద్‌ జిల్లా): వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ తెలంగాణ ప్రాంతంలో రోజురోజుకూ బలం పుంజుకుంటోందని పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీన‌ర్ కాంపెల్లి సమ్మయ్య అన్నారు. మాజీ ఎంపీ ఇంద్రకర‌ణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీలో చేరుతుండడమే దీనికి తాజా ఉదాహరణ అన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి వైయస్‌ఆర్‌సిపికి సానుభూతి ఉందన్నారు. దివంగత మహానేత డాక్టర్ ‌వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలు ప్రజలకు నేరుగా అందిన కారణంగానే ప్రజలు వైయస్‌ఆర్‌సిపిని ఆదరిస్తున్నారని సమ్మయ్య పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నది ప్రజలందరి ఆశ, ఆకాంక్ష అని ఆయన చెప్పారు.
Back to Top