టీడీపీకి గోపాలపురం ఎమ్మెల్యే షాక్

కొవ్వూరు:

తెలుగుదేశం పార్టీకి చెందిన గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత ఆ పార్టీకి షాకిచ్చారు. తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబును ఆమె సోమవారం ఉదయం ఆయన స్వగృహంలో కలిశారు. తాను వైయస్ఆర్ సీపీలో చేరతానని వనిత ఆయనకు చెప్పారు. ఇలా ఉండగా తాను నవంబరు నాలుగో తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానని కృష్ణబాబు వెల్లడించారు.

Back to Top