నియోజకవర్గానికి రూ.20 కోట్లు..అవినీతి సోమ్ముతో గెలవడానికి టీడీపీ ప్రణాళిక



విజయవాడః రాజకీయంగా టార్గెట్‌ చేయడానికే ఐటి దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు బాహాటంగా విమర్శలు చేయడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి   అన్నారు. ఐటి దాడులపై ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఐటి అధికారులకు  బందోబస్తు ఇవ్వకూడదని చంద్రబాబు  చెప్పడం ఎల్లో మీడియాలోనే వచ్చిందని ఇలాంటి విపరీత ధోరణులు చూస్తున్నపుడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? రాచరిక వ్యవస్థలో ఉన్నామా? అనే సందేహాం కలుగుతోందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఏదో  అన్యాయం జరిగిపోతుందన్నట్లు ఎల్లోమీడియా వార్తలు రాస్తున్నాయన్నారు.  ఐటి దాడులు పరిశీలిస్తే కేవలం వ్యాపారులపై చేశారని వారిలో రియల్టర్లు, రొయ్యల  వ్యాపారులే ఉన్నారన్నారు.  దాడులు జరిపిన వారిలో  టీడీపీ, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఉన్నారుని, కాని ఇవన్నీ తమకు చెందిన వ్యక్తులపైనే జరుగుతున్నాయంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని అంబటి మండి పడ్డారు. దాడులు జరగడానికి వీలులేదంటూ, చట్టబద్ద సంస్థలు తమ విధులను నిర్వహించకుండా ఎందుకు అడ్డుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. . చట్టబద్దమైన పద్ధతుల్లోనే  ఐటి తనిఖీలు  జరుగుతుంటే  ఏదో ప్రమాదాలు జరుగుతున్నాయన్నట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా వింత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రమాదం జరుగుతోంది ప్రజలకా, చంద్రబాబుకా, చంద్రబాబు బినామీలకా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో  ప్రజలు,మేధావులు, ప్రజస్వామ్యవాదులు ఆలోచించాలన్నారు.
 చంద్రబాబు విపరిత ధోరణీతో ప్రవర్తిసున్నారని దుయ్యబట్టారు.  ఎన్నికల ఖర్చు నువిచ్చలవిడిగా చంద్రబాబు పెంచేస్తున్నారని ధ్వజమెత్తారు.  పక్క రాష్ట్రాల్లో బేరీజు వేసుకుంటే అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఏపీలోనే ఎన్నికల ఖర్చు ఉన్నట్లుగా స్పష్టమవుతోందన్నారు.  ఎన్టీఆర్‌ హయాంలో కూడా ఎన్నికల వ్యయం ఇంతలేదని ఎన్టీఆర్‌ను దించి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల వ్యయం విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు.
అవినీతిసొమ్ముతో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో విచ్చలవిడిగా డబ్బును ఖర్చుపెడుతున్న  దుర్మార్గ వ్యక్తి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడని ఎండగట్టారు. మేథావులు దీనిపై ఆలోచన చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు ప్రతి నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల నిల్వ పెట్టామని నారా లోకేష్‌  తనతో చెప్పారని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.  జగన్‌ను అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 
ప్రజాభిమానం లేకపోయినా  అవినీతి సొమ్ముతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రణాళిక వేశారన్నారు.  నారాయణ,సుజనాచౌదరి, సీఎం రమేష్‌ వంటి వారు రాజకీయ నాయకులు కారని చంద్రబాబుకు బ్లాక్‌మనీ సమకూర్చే  ఆర్థిక నేరస్తులని ఆరోపించారు. కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొన్నారని అది బ్లాక్‌ మనీ కాదా అని ప్రశ్నించారు. ఒక్కొక ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇవ్వడం వాస్తవం కాదా..ఎమ్మెల్యే కిలారి మరణవాంగూల్మంలో వాస్తవం బయటకు రాలేదా. అంటూ ప్రశ్నించారు. రాష్టాన్ని అవినీతిమయం చేసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. 
టీడీపీ నేతలు  సీఎం రమేష్,సుజనాచౌదరి, నారాయణ, గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలపై ఐటి దాడులు నిర్వహించాలని వీరు రాబోయే ఎన్నికల్లో బ్లాక్‌మనీ వెదజల్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.  వీరిపై దాడులు చేసి బ్లాక్‌మనీ బయటకు తీసి ప్రజాస్యామ్యాన్ని కాపాడాలన్నారు. 
 చంద్రబాబుకు న్యాయవ్యవస్థపై గౌరవం లేదని బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు  నోటిసులు ఇస్తే కోర్టు వెళ్లకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చట్టానికి చంద్రబాబు అతితుడు కాదన్నారు. చంద్రబాబును చట్టమంటే గౌరవం లేని ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. చట్టబద్ధంగా చంద్రబాబు వ్యవహరించకపోతే ప్రజలు క్షమించరని అన్నారు.
Back to Top