అధికారపార్టీ నేతలే బినామీలు

అధికారపార్టీ నేతలే బినామీలుగా మారి అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారని.. బాధితులు విజయవాడలో ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఐడీ విచారణ పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. బకాయిలపై బాండ్లను విడుదల చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులు విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచే.. తుమ్మల పల్లి కళాక్షేత్రానికి భారీగా చేరుకున్న బాధితులు.. అక్కడి నుంచి జింఖానా మైదానం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. 

Back to Top