నేత‌న్న‌ను ప‌ట్టించుకోని టీడీపీ ప్ర‌భుత్వం

ఉరవకొండ: చేనేతల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్‌ఆర్ సీపీ చేనేత విభాగం జిల్లా కమీటి సభ్యులు చెంగలమహేశ్వర ధ్వ‌జ‌మెత్తారు. శుక్రవారం స్థానిక బళ్ళారి బైపాస్‌లోని దేవాంగ ఫంక్ష‌న్‌హాల్‌లో చెంగ‌ల మ‌హేశ్వ‌ర ఆధ్వ‌ర్యంలో చేనేత‌ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత అంతటి ప్రాధాన్యత కల్గిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలన్న చిత్తశుద్ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోయిందన్నారు. చేనేత సమస్యల పై దేవాంగులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కార్మికులకు ఉపాధి లేక ఆకలి చావులకు పాల్పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు. కార్య‌క్ర‌మంలో చేనేత విభాగం నేత‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top