తల్లి బాటలో పిల్లలు...ఉరవకొండ

4 నవంబర్ 2012: చరిత్రాత్మకమైన 'మరో ప్రజాప్రస్థానం' సాగిస్తోన్న షర్మిలతో పాటు మేము సైతమంటూ ఆమె పిల్లలు కూడా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి శనివారంనాటి పాదయాత్రలో అమ్మను కలుసుకునేందుకు అనంతపురం జిల్లా లత్తవరం వచ్చారు. వారిద్దరూ తల్లితో పాటు మధ్యాహ్న భోజనవిరామం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర నడిచారు. వర్షం కురిసినప్పటికీ వారు ఆ వానలోనే పాదయాత్రలో తల్లికి తోడు నడిచారు. వర్షానికి తడిసిన రాజారెడ్డి ముఖాన్ని షర్మిల ఆప్యాయంగా తుడిచారు. పిల్లలిద్దరూ బురదలోనే తల్లి వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇదిలావుండగా శనివారంనాటి పాదయాత్రతో షర్మిల ప్రస్థానంలో 223.6 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి. ఈ పాదయాత్రలో శనివారం శోభా నాగిరెడ్డి, జి.గుర్నాథరెడ్డి, ప్రసాద రాజు, వై.విశ్వేశ్వర రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి తదితర వైయస్ఆర్ సీపీ నేతలు పాల్గొన్నారు.

Back to Top