స్విస్ చాలెంజ్ వట్టి బూటకం

తిరుపతి: స్విస్ ఛాలెంజ్ విధానం
వట్టి బూటకం అని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్
రెడ్డి అభిప్రాయ పడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం చేస్తున్నారని
విమర్శించారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  వేల కోట్లు అక్రమ సంపాదనకు చంద్రబాబు సర్కార్
స్కెచ్ గీస్తోందని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తమకు అనుకూలమైనవారికే పనులు
అప్పగించి.. వేల కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారని చంద్రబాబు సర్కార్‑పై
మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమ దందాలను ఎండగట్టడానికే తాము గడప గడపకు వెళ్తున్నామని
భూమన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

Back to Top